ఆంధ్రప్రదేశ్‌

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో పరిపాలన వికేంద్రీకరణపై బిల్లును రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఆయన రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు చేసిన ఇన్‌సైడర్ ట్రేడిండ్‌పై మాట్లాడారు. గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన అనుయాయులు భూ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. భారీ ఎత్తున జరిగన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. సభలో అమరావతి భూములపై వాస్తవాలను మంత్రి బుగ్గన చెప్పారన్నారు. ఇవి నిజాలు అయినా కాకపోయినా, అసెంబ్లీలో చెప్పడం వల్ల డాక్యుమెంట్ కావడంతో తిరస్కరించలేమన్నారు. అమరావతి భూముల వ్యవహారంపై ప్రజలకు నిజానిజాలు తెలిసేందుకు, సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రిని కోరారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, సభాపతి నుంచి వచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. శాసన సభకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, సభాపతికి క్వాసీ-జ్యుడీషియల్ అధికారాలు ఉంటాయని గుర్తు చేశారు. స్పీకర్ జడ్జితో సమానమని, ఏదైనా అంశంపై విచారణ చేపట్టాలని అడిగే హక్కు స్పీకర్ ఉంటుందని స్పష్టం చేశారు.