ఆంధ్రప్రదేశ్‌

ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 20: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనేది కేవలం రాజధాని ప్రాంతానికి సంబంధించినది కాదని, ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. భావితరాల కోసం ప్రభుత్వ నిర్బంధాలను లెక్కచేయబోమని, రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఎంతవరకైనా పోరాడుతామని పేర్కొన్నారు. రాజధాని అంశంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం సచివాలయం వద్దనున్న ఫైర్ స్టేషన్ నుంచి చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాలినడకన అసెంబ్లీలోకి ప్రవేశించి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేవ్ అమరావతి, ఒక రాష్ట్రం ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయు డు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మూడు రాజధానుల ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని స్పష్టంచేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్యగా అభివర్ణించారు. గృహనిర్బంధాలు, అరెస్ట్‌లను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీడీపీ, జేఏసి నేతలను
నిర్బంధించడం హేయమైన చర్య అని, నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉందని స్పష్టంచేశారు. ఈ విధమైన అణచివేత చర్యలు, అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ, సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ ఇంతటి నిర్బంధం చూడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది చరిత్రలో బ్లాక్‌డేగా నిలిచిపోతుందని, తక్షణమే గృహనిర్బంధాలను ఎత్తివేసి అరెస్ట్ చేసిన రైతులు, నేతలను విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
'చిత్రం...చంద్రబాబు నేతృత్వంలో టీడీఎల్పీ నిరసన ప్రదర్శన