ఆంధ్రప్రదేశ్‌

సచివాలయం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 20: ఎగ్జిక్యుటివ్ కేపిటల్ (పాలనా రాజధాని)గా విశాఖను నిర్ణయిస్తూ కేబినెట్ ఆమోదించిన తీర్మానంతో విశాఖకు రాజధాని హోదా వచ్చేసింది. గత కొద్ది రోజులుగా విశాఖలో సచివాలయం ఏర్పాటు సంబంధించి అంతర్గతంగా చర్చ జరుగుతునే ఉంది. ఇప్పటికే సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, వారి నివాసాలకు సంబంధించి అనే్వషణ పూర్తయినట్టు సమాచారం. ఐటీ కంపెనీలకు సంబంధించి రుషికొండలో నిర్మాణం పూర్తి చేసుకున్న, నిర్మాణ దశలో ఉన్న భవనాలను ఇప్పటికే ప్రభుత్వం పరిశీలించి, స్వాదీనం చేసుకుంటోంది. రుషికొండ హిల్ 1, హిల్ 2 లను ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్) నుంచి మినహాయించింది. హిల్ 3 మాత్రం ఇంకా ఎస్‌ఈజెడ్ పరిధిలోనే ఉంది. దీన్ని డీ నోటిఫై చేసేందుకు ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. రుషికొండలో సుమారు తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు అందుబాటులో ఉండగా, ఇప్పటికిప్పుడు కార్యకలాపాలు చేపట్టేందుకు వీలుగా 4 నుంచి 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు సిద్ధింగా ఉన్నాయి. మిగిలిన నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. రుషికొండ హిల్ 3లో మిలీనియం టవర్స్‌లోనే 2.08 లక్షల చదరపు అడుగుల భవనం
అందుబాటులో ఉండగా, మిలీనియం టవర్స్ 2 ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. హిల్ 1లో మిరాకిల్ సాఫ్ట్‌వేర్, హిల్ 2లో సింబయాసిస్, న్యూనెట్ సాఫ్ట్‌వేర్ సంస్థల్లో మరో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలు అందుబాటులో ఉన్నాయి. మిలీనియం టవర్స్‌ను సచివాలయం ప్రధాన భవనానికి ఉపయోగించుకున్నా, మిగిలిన భవనాలు ప్రభుత్వ శాఖల కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. పాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేయడంతో పాటు అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు కూడా ఇక్కడే నెలకొల్పేందుకు కేబినెట్‌లో నిర్ణయించారు. దీంతో శాఖాధిపతుల కార్యాలయాలు, ఉన్నతాధికారులకు నివాస భవనాల అనే్వషణ కూడా ఇప్పటికే స్థానిక యంత్రాంగం పూర్తి చేసింది. అన్ని ప్రభుత్వ విభాగాలు ఇక్కడే నెలకొల్పనున్న దృష్ట్యా దాదాపు 400 మంది వరకూ ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులకు నివాస సదుపాయం కల్పించాల్సి ఉంది. దీనికోసం ఇప్పటికే వీఎంఆర్‌డీఏ ఆధీనంలో ఉన్న హరిత, రో హౌసింగ్ భవనాలను స్వాదీనం చేసుకుని, వాటిని సిద్ధం చేస్తున్నారు. ఇటీవల విశాఖలో క్రెడాయ్ నిర్వహించిన ప్రాపర్టీ షో సందర్భంగా రాజధాని అవసరాలకు తగిన భవనాలను సమకూర్చాల్సిందిగా అభ్యర్థించినట్టు తెలిసింది. క్రెడాయ్ కూడా సానుకూలంగానే స్పందించింది. దీంతో శాఖాధిపతుల నివాసాలకు కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా అవసమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

'చిత్రం...రుషికొండ హిల్ 3లో కార్యకలాపాలకు సిద్ధంగా ఉన్న మిలీనియం టవర్స్