ఆంధ్రప్రదేశ్‌

పోలీసుల్ని దింపినా ఉద్యమాన్ని అణచలేరు: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), జనవరి 20: యావత్తు ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ఉన్న బలమైన ఆకాంక్షే నేడు ప్రజలందరినీ అసెంబ్లీకి తీసుకొచ్చిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎంత మంది పోలీసుల్ని దింపినా ఈ ఉద్యమాన్ని అణచివేయడం ఎవరి తరంకాదని సోమవారం ట్విట్టర్ వేదికగా లోకేష్ స్పష్టం చేశారు. శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించడం సరికాదని హితవు పలికారు. ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని, మూడు రాజధానులు వద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనే నినాదంతో అసెంబ్లీ ముందు నిరసన తెలిపినట్లు చెప్పారు. శాసనసభలో చేసిన తీర్మానాలకు, చెప్పిన మాటలకు విలువ లేనప్పుడు ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం ఎక్కడ ఉంటుంది అంటూ అమరావతి ఇక్కడే ఉంచాలి అంటూ ఉద్యమం చేస్తున్న వీడియోను ట్విట్టర్‌కు ట్యాగ్ చేశారు. రాజధానిని తరలించాలని అంత పట్టుదల సీఎం జగన్‌కు ఎందుకు అంటూ లోకేష్ మరో ట్వీట్‌లో ప్రశ్నించారు. ఇంటికి పది మంది పోలీసులా, ఇళ్ల ముందు వలలు పట్టుకొని నిలబడటం ఏమిటి, రాజదాని గ్రామాల్లో యుద్ధ వాతావరణం ఎందుకు అంటూ నిలదీశారు.