ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంలో తుగ్లక్ పాలన: కళా ధ్వజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 20: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ఆయన పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు విమర్శించారు. సోమవారం మంగళగిరి సమీపంలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రాజధానుల నిర్ణయం సరైంది కాదు కాబట్టే ప్రజలు తిరగబడుతున్నారని, ఆ భయంతో 8 వేల మంది పోలీసులను రక్షణగా పెట్టుకుని జగన్ పాలన కొనసాగిస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తక్కువ వ్యవధిలోనే ఈ గతి ఎందుకు పట్టిందో జగన్ ఆలోచించుకోవాలని సూచించారు. మూడు రాజధానుల పేరుతో జగన్ తీసుకున్న పిచ్చి తుగ్లక్ నిర్ణయంతో తన సమాధి తానే కట్టుకున్నారన్నారు. రాజధాని మార్చే హక్కు జగన్‌కు ఎవరిచ్చారని నిలదీశారు. అసెంబ్లీలో అమరావతినే రాజధాని అని, దాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు ఉండాలని చెప్పిన విషయం జగన్ గుర్తుంచుకోవాలన్నారు. అమరావతిని కాపాడేందుకు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్‌లు చేయడం అప్రజాస్వామికమన్నారు. చట్టాలు, వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుని, అణచివేత ధోరణితో ముందుకెళ్తున్న జగన్‌కు సరైన సమయంలో ప్రజలు బుద్ధిచెప్తారని హెచ్చరించారు.