ఆంధ్రప్రదేశ్‌

నాలుగు లేన్లుగా కడప - రేణిగుంట హైవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 20: కడప - రేణిగుంట రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. ఈ రోడ్డు నిర్మాణాన్ని నేషనల్ హైవే విభాగం చేపట్టనుంది. ప్రస్తుతం కడప - తిరుపతి మధ్య రెండు వరుసల రోడ్డు మాత్రమే ఉంది. దీన్ని నాలుగు వరుసలకు విస్తరించనున్నారు. ఇందుకు అధికారులు అంచనాలు తయారుచేశారు. సుమారు 127.05 కిలోమీటర్ల మేర ఈ ఫోర్‌లైన్ రోడ్డు నిర్మించనున్నారు. ఫోర్‌లేన్ నిర్మాణానికి భూసేకరణతో సహా ఒక కిలోమీటర్‌కు రూ.23.2 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. 127 కిలోమీటర్ల రహదారికి సుమారు రూ.2,808 కోట్లు అవసరమవుతుందని భావిస్తున్నారు. కడప జిల్లా పరిధిలో 107 కిలోమీటర్లు, చిత్తూరు జిల్లా పరిధిలో 20.98 కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉంటుంది. ఫిబ్రవరి మొదటి వారంలో భూసేకరణ పనులు ప్రారంభించి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు.