ఆంధ్రప్రదేశ్‌

గోదావరి జిల్లాల్లో గృహ నిర్బంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 20: చలో అసెంబ్లీ ముట్టడి ఆందోళన నేపథ్యంలో గోదావరి జిల్లాలను పోలీసులు గుప్పెట్లోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖ నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. ఆదివారం నుంచే ఈ గృహ నిర్బంధాలకు పోలీసులు దిగారు. అమరావతి వెళతారనే అనుమానం ఉన్న నేతలందరినీ గృహ నిర్బంధంలోనే ఉంచారు. అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తున్న జేఏసీ నేతలను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో రాజకీయ కేంద్రం రాజమహేంద్రవరంలో నేతలంతా స్థానిక సుబ్రహ్మణ్య మైదానం నుంచి బయలుదేరి వెళ్లాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు నేపధ్యంలో ముందుగానే పోలీసులు పెద్ద ఎత్తున సుబ్రహ్మణ్య మైదానంలో పహారా కాశారు. ఏ ఒక్క నేతను ఇంటి నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ యువ నేత ఆదిరెడ్డి వాసు, గుడా మాజీ ఛైర్మన్ గన్ని కృష్ణ, కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్, రాష్ట్ర శెట్టిబలిజ, గౌడ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పాలిక శ్రీను, టీడీపీ నగర అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి మణి, సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావును వారి వారి ఇళ్లల్లోనే నిర్బంధం చేశారు. ఆయా పార్టీలు, జేఏసీకి చెందిన నాయకులను వారి వారి గృహాల నుంచి బయటకు వెళ్లకుండా, వారి ఇళ్లకు నాయకులు, కార్యకర్తలు రాకుండా బారికేడ్లు ఏర్పాటుచేసి పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై గుడా మాజీ ఛైర్మన్ గన్ని కృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ఎన్వీ శ్రీనివాస్‌తో పాటు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, జడ్పీ మాజీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తదితరులు పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.