ఆంధ్రప్రదేశ్‌

మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని మూడు రాజధానులుగా రాష్ట్ర ప్రభుత్వం విభజించడాన్ని వ్యతిరేకిస్తున్నానని, దీనికి నిరసనగా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు రాజీనామా లేఖను పంపారు. ఉమ్మడి రాష్ట్ర విభజన ప్రతిపాదన రాగానే విభజిత నవ్యాంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ అసెంబ్లీలోను, బయట ప్రయత్నించామన్నారు. తెలుగుదేశం పార్టీలో అనేక విధాలుగా ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడుకు ధన్యావాదాలు తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నా పట్ల చూపిన అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరపున పోటీచేసే అవకాశం కల్పించారని, ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఓటర్లు తన పట్ల చూపిన ఆదరాభిమానాలను ఎన్నటికీ మరువలేనన్నారు. 2019 ఎన్నికల అనుభవాల దృష్ట్యా భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చానన్నారు. అమరావతి రాజధాని విడిపోతున్నందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు డొక్కా లేఖలో పేర్కొన్నారు.
'చిత్రం... డొక్కా మాణిక్య వరప్రసాద్