ఆంధ్రప్రదేశ్‌

గోళ్లతో రక్కి, చొక్కా చింపారు: ఎంపీ గల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 21: జేఏసీ నాయకులు ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శాంతియుతంగా జాతీయ జెండాను పట్టుకుని వెళ్తుంటే పోలీసులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని, వారి తీరు తీవ్ర అభ్యంతకరమని గుంటూరు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ ఆక్షేపించారు. మంగళవారం గుంటూరు జిల్లా జైలు నుండి బెయిల్‌పై విడుదలైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. సోమవారం అసెంబ్లీ ప్రాంతానికి చేరుకుని ఆందోళన చేసేందుకు వెళ్తుండగా, అక్కడున్న పోలీసులు వారిపైన వారే మట్టి గడ్డలు వేసుకుని తమపై లాఠీఛార్జి చేశారని ఆరోపించారు. తనను పోలీసులు గోళ్లతో రక్కి, చొక్కాను చింపి లాక్కెళ్తుంటే తుళ్లూరు మహిళలు అడ్డుపడ్డారన్నారు. ఒక పథకం ప్రకారం సీఆర్‌పిఎఫ్ సిబ్బందితో దాడులు చేయిస్తున్నారన్నారు. గతంలో రాజధాని మహిళలు పోలీసులు తమను హేళన చేస్తూ ఒంటిపై గిచ్చుతూ, రక్కుతున్నారని ఫిర్యాదు చేస్తే తమకు అర్థం కాలేదన్నారు. 15 గంటలపాటు జిల్లా మొత్తం తిప్పారని అన్నారు. గుంటూరు, కొల్లిపర నుంచి మళ్లీ గుంటూరు, నరసరావుపేట, రొంపిచర్ల స్టేషన్లకు తరలించి గంటలకొద్దీ కూర్చోబెట్టారని, అర్ధరాత్రి సమయంలో చివరగా మంగళగిరికి తీసుకొచ్చారని తెలిపారు. గల్లా జయదేవ్ అనుచరులు పూచీకత్తుపై బెయిల్ పత్రాలు తీసుకువచ్చి మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదల చేయించారు.