ఆంధ్రప్రదేశ్‌

వీధి రౌడీల కంటే హీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: టీడీపీ శాసనసభ్యులు సంస్కార హీనులు.. అసలు ఇలాంటి వ్యక్తులు ఎమ్మెల్యేగా ఎందుకు ఎన్నికయ్యారో.. వీరు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో వారికే తెలియదు.. ప్రజల సమస్యలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో చేతనైతే సలహాలు ఇవ్వాలి.. అలా చేతకాకపోతే అసెంబ్లీకి రాకుండా బయటే ఉండాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో బుధవారం ప్రతిపక్ష సభ్యులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా పోడియం మెట్లు పైకెక్కి ఏకంగా స్పీకర్ చైర్ చుట్టూ చేరి ఆయన మైక్ నుంచి కామెంట్లు చేస్తున్నారు.. ఇంతటి దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న పరిస్థితి దేశంలో ఎక్కడా చూడలేదు.. చూడబోమన్నారు. సభలో వారు మొత్తం కలిపి 10 మంది.. ఇక్కడ 151 మంది ఎంతో ఓపిగ్గా కూర్చొని వింటుంటే పోడియంపై నుంచి రెచ్చగొట్టేలా కామెంట్లు చేస్తున్నారు.. దీనికి రెచ్చిపోయి అధికార పక్ష సభ్యులు ఒక వేళ వారిపై దాడి చేస్తే తమపై దాడి చేసారు అంటూ దాని కూడా తమకు అనుకూలంగా మీడియాతో వక్రీకరించుకుని రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తారని మండిపడ్డారు. లాంటి దిక్కుమాలిన ఆలోచన చేసే దిక్కుమాలిన ఎమ్మెల్యేలు, అదొక దిక్కుమాలిన పార్టీ అంటూ జగన్ నిప్పులు చెరిగారు. 10 గంటలకు సభ ప్రారంభమై అత్యంత ముఖ్యమైన రైతు భరోసా కేంద్రాలపై జరుగుతున్న చర్చను గత రెండు గంటలు అడ్డుకుంటూ మరో వైపు స్పీకర్‌ను కూడా అగౌరవించేలా చేతులు ఊపుతూ కామెంట్లు చేస్తున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో తమ సభ్యులకు రెచ్చిపోయే పరిస్థితులు రాకుండా ఎలా ఉంటాయని ప్రశ్నించారు. అధ్యక్షా.. ఇప్పటికైనా ఒకటే చెబుతున్నా ఆ మెట్లు కాదుకదా రింగ్ దాటి ఎవరైనా అడుగు ముందుకు వేస్తే మార్షల్స్‌చే ఎత్తి వెలుపలకు పంపించండంటూ ఉద్వేగంతో అన్నారు. ‘లేకపోతే ఏమిటిది అధ్యక్షా 10 మంది ఉన్నారు. రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. వీధి రౌడీలు వీళ్లకంటే బెటర్. వీరు అంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. నిజంగా ఒక వ్యవస్థ అనేది నిలబడాలంటే వీధి రౌడీలు ఎక్కడైనా కన్పిస్తే వారిని ఏరివేయకపోతే వ్యవస్థ బాగుపడదు. దయ చేసి వెంటనే మార్షల్స్‌ను పిలిపించండి’ అని సీఎం జగన్ అన్నారు.