ఆంధ్రప్రదేశ్‌

నిరూపించలేకే తప్పుడు కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: టీడీపీ నేతలపై చేసిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు నిరూపించలేక సీఐడీతో కేసు పెట్టించారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. గురువారం మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో పుల్లారావు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని విమర్శించారు. వీటిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. వైసీపీ నేతలు
దళితుల్ని అడ్డు పెట్టుకుని ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. దళితుల భూములను కొనుగోలు చేసిన అంశంపై వాస్తవం లేదని, కేవలం రాజకీయ దురుద్దేశంతో తనపైనా, మాజీ మంత్రి నారాయణపైనా కేసులు పెట్టారని మండిపడ్డారు. తాను బినామీల పేర్లతో రాజధానిలో భూములు కొనుగోలు చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపించారని, వాటిని తేల్చాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని, ఎక్కడైనా చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఉంటే చర్యలు తీసుకోవాలని ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని తామే కోరుతున్నామని ప్రశ్నించారు. తప్పుడు కేసులు పెడుతున్న అధికారులు, ప్రభుత్వంపై పరువునష్టం దావా వేసి కోర్టుకు లాగుతామని పుల్లారావు హెచ్చరించారు.

'చిత్రం... ప్రత్తిపాటి పుల్లారావు