రాష్ట్రీయం

సీమలోనే రాజధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా రాజధానిని రాయలసీలోనే ఏర్పాటు చేయాలని మాజీ హోంమంత్రి ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డికి మైసూరా సూచించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లును శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపించాలని నిర్ణయించడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. మూడు రాజధానులపై ప్రవేశ పెట్టిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు తమకు ఎంతమాత్రం సమ్మతం కాదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకునే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్‌సీపీ సర్కారు తన నిర్ణయాన్ని మార్చుకుని, గ్రేటర్ రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని హితవు పలికారు. లేని పక్షంలో గతంలో డిమాండ్ చెసిన విధంగానే గ్రేటర్ రాయలసీమ వైపు మేము అడుగులు వేయాల్సి వస్తుందని మైసూరా హెచ్చరించారు. రాష్ట్ర సమగ్రతకు భగ్నం వాటిల్లితే, అందుకు ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కారణమవుతారని అన్నారు. వీరిద్దరూ రాయలసీమ వాసులేనని ఆయన పేర్కొన్నారు. సీఎం, ప్రతిపక్ష నేత పునరాలోచన చేసుకుని రాయలసీమ ప్రాంత హక్కు అయిన రాజధానిని గ్రేటర్ రాయలసీమలో నెలకొల్పాలని ఆయన అభిప్రాయపడ్డారు. శ్రీబాగ్ ఒప్పందానికి గౌరవం కల్పిస్తారని ఆశిస్తున్నామని ఇరువురు నేతలకు తెలిపారు.
'చిత్రం... మాజీ హోంమంత్రి ఎంవీ మైసూరా రెడ్డి డిమాండ్