ఆంధ్రప్రదేశ్‌

ఒక సభ గురించి మరో సభలో చర్చించడమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 26: నేటి అసెంబ్లీ అజెండాయే రాజ్యాంగ విరుద్ధమని, ఒక సభ గురించి మరో సభలో చర్చించడం పార్లమెంటరీ ప్రాక్టీసెస్‌కు విరుద్ధమని విపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది ఒకరకంగా రాజ్యాంగ వ్యవస్థలను కించపర్చడమే అని, ఇప్పటికే అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారని విమర్శించారు. మంగళగిరి సమీపంలోని జాతీయ పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సోమవారం జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నేటి అసెంబ్లీ సమావేశంలో మరో ఉల్లంఘనకు జగన్ ప్రభుత్వం తెరతీసిందని, కౌన్సిల్ గురించి మొన్న అసెంబ్లీలో చర్చించడమే ఒక ఉల్లంఘన కాగా, నేడు మళ్లీ చర్చిస్తామన్న అసెంబ్లీ ఎజెండా మరో ఉల్లంఘన అవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ తప్పులపై తప్పులు చేస్తున్నారని, దురుద్దేశంతోనే ఈవిధంగా చేస్తున్నారని, ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలను లాక్కున్నారన్నారు. ప్రలోభాలు, బెదిరింపులు, అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు. కౌన్సిల్‌లో 22మంది మంత్రులంతా వచ్చి చైర్మన్‌పై దౌర్జన్యానికి దిగారని, కులం, మతం పేరుతో
దూషించారని, మంత్రుల వికృత చేష్టలు రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చాయన్నారు. అసెంబ్లీలో జగన్ చెప్పినట్లు జరగాలని, కౌన్సిల్‌లో మెజార్టీ లేకపోయినా తన పంతం ప్రకారంగానే కౌన్సిల్ నడవాలనేలా జగన్ ధోరణి ఉందన్నారు. అసెంబ్లీలో స్పీకర్ విచక్షణాధికారం ఉపయోగించడం కరెక్ట్ అని, కౌన్సిల్‌లో మాత్రం చైర్మన్ విచక్షణాధికారం ఉపయోగించడం సరికాదని జగన్ చెప్పడం దారుణమన్నారు. అసెంబ్లీలో రింగు గీసి అది దాటివచ్చిన వాళ్లను బయటపడేయాలని స్పీకర్‌కు చెపుతున్న జగన్, కౌన్సిల్‌లో వైసీపీ మంత్రులే పోడియం బల్లలు ఎక్కినా వారిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. శాసనమండలి ఇప్పటివరకు అనేక బిల్లులను ఆమోదించి పంపిందని, మూడు రాజధానులపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, 13 జిల్లాల్లో జరగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించిందన్నారు. ప్రభుత్వ విధానం ప్రజాకాంక్షలకు వ్యతిరేకంగా ఉందికాబట్టే రూల్ 71 ద్వారా ఆ పాలసీకి అనుకూలంగా శాసనమండలి తీర్మానించిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రజల ఆకాంక్షలను నిలబెట్టేందుకు ఎమ్మెల్సీలు దృఢంగా నిలబడ్డారని, మంత్రుల దుర్భాషలు, దౌర్జన్యాలను ప్రతిఘటించారన్నారు. మండలి సమావేశానికి 32మంది ఎమ్మెల్సీలు ఉండగా 23మంది హాజరయ్యారు. మరోవైపు టీడీఎల్పీ భేటీకి రాలేమని ఐదుగురు ఎమ్మెల్సీలు గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల, రామకృష్ణ ముందుగానే సమాచారం అందించారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు వర్ధంతి దృష్ట్యా సమావేశానికి రాలేమని గాలి సరస్వతి, తన మేనత్త కర్మ కార్యక్రమం ఉండటం వల్ల రాలేనని కేఈ ప్రభాకర్, ఆరోగ్యం బాగోలేదని శత్రుచర్ల, తన నివాసంలో వివాహం ఉందని తిప్పేస్వామి తెలియజేయగా, విదేశాల్లో ఉన్నందున సమావేశానికి హాజరుకాలేక పోతున్నానని రామకృష్ణ వివరణ ఇచ్చారు. తమ ఎమ్మెల్సీలతో ఎప్పటికప్పుడు పార్టీ పెద్దలు చర్చలు జరుపుతున్నారని, మండలిలో టీడీపీకి 32మంది ఎమ్మెల్సీల బలం ఉన్నప్పటికీ ఇప్పటికే పోతుల సునీత, శివానందరెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారని, మండలి సమావేశపరిస్తే సభ్యులు చేజారకుండా ఉండేలా టీడీపీ వ్యూహరచనలో నిమగ్నమైంది. అలాగే నేడు జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని ఈ సమావేశంలో నిర్ణయించారు.

'చిత్రం... టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు