ఆంధ్రప్రదేశ్‌

ఈ ఏడాది 12 ప్రయోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 26: ఈ ఏడాది 12 ప్రయోగాలు చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నట్లు షార్ అసోసియేట్ డైరెక్టర్ ఎంబిఎన్ మూర్తి తెలిపారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట స్పేస్ సెంటర్‌లోని ఇంగ్లీషు మీడియం పాఠశాలలో ఆదివారం 71వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న షార్ అసోసియేట్ డైరెక్టర్ ఎంబిఎన్ మూర్తి మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలను విజయవంతంగా నిర్వహిస్తూ ప్రపంచ దేశాల నుండి ప్రశంసలు అందుకుంటున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ ఏడాది 12 ప్రయోగాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఇందుకోసం సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఫిబ్రవరిలో జీఎస్‌ఎల్‌వి మార్క్-2తో ప్రారంభమై పీఎస్‌ఎల్‌వి సి-49, సి-50 భారీ ప్రయోగాలకు శ్రీకారం చుట్టిందన్నారు. గత ఏడాది షార్ నుండి చేపట్టిన ప్రయోగాలన్నీ విజయవంతం కావడం అభినందనీయమన్నారు. గత ఏడాది ప్రయోగించిన శాటిలైట్ల ప్రభావంతో దేశంలోని మారుమూల ప్రాంతాలలో సైతం సమాచార వ్యవస్థను మెరుగుపరిచినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. షార్‌కు భద్రత కల్పిస్తున్న కేంద్ర బలగాలు సిఐఎస్‌ఎఫ్ పనితీరును ఆయన ప్రశంసించారు.