ఆంధ్రప్రదేశ్‌

తూర్పు గోదావరిలో ముంపు బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుకొండ/గోకవరం, సెప్టెంబర్ 18: భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలోని కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నం, మండల కేంద్రం గోకవరంలోని మూడు కాలనీలు ఆదివారం నీట మునిగాయి. శనివారం అర్థరాత్రి తూర్పు ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదయ్యింది. ఫలితంగా ఏజెన్సీలోని సూరంపాలెం ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తింది. దీనితో వరద నీటిని దిగువకు వదిలివేయడంతో కోరుకొండ మండలంలోని శ్రీరంగపట్నం గ్రామం నీటమునిగింది. గ్రామంలోని మోదకొండమ్మ ఆలయం వద్ద ఉన్న ఎస్సీ, ఎస్టీ కాలనీ నీట మునిగింది. సుమారు వందకు పైగా ఇళ్లు ముంపులో చిక్కుకున్నాయి. కాలనీలో మొలలోతు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాజమండ్రి సబ్-కలెక్టర్ విజయకృష్ణన్ ముంపు ప్రాంతంలో పర్యటించి, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక వరద నీటితో గోకవరంలోని ఊరకాలువ, పెద్దకాలువ ఉద్ధృతంగా ప్రవహించడంతో గ్రామంలోని బ్రహ్మాల కాలనీ, సంజీవనగర్ కాలనీ, అంబేద్కర్‌పేట నీటమునిగాయి. కాలనీల్లో మోకాలి లోతు నీరు చేరింది. పలు ఇళ్లలోకి నీరు చేరింది. సాయంత్రానికి ముంపు తీవ్రత తగ్గుముఖం పట్టింది.

శ్రీరంగపట్నం గ్రామంలోని ముంపు ప్రాంతంలో పర్యటిస్తున్న రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయకృష్ణన్