ఆంధ్రప్రదేశ్‌

దేవతామూర్తుల అలంకరణలో ఒక్కటైన యువ జంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుకు, జనవరి 27: పెళ్లిళ్లు రకరకాల పద్దతుల్లో జరుగుతుండడం మనం చూస్తుంటాం. అయితే కర్నూలు జిల్లా అవుకు పట్టణంలో సోమవారం జరిగిన పెళ్లి వేడుకను మీరు ఎప్పుడూ చూసి ఉండరు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, లక్ష్మీదేవిని పెళ్లిపీటలపై కూర్చోబెట్టి కల్యాణ వేడుక జరిపించారా అన్నట్టుగా శ్రీనివాసులుగౌడ్, శ్రీవాణి వివాహవేడుక జరిగింది. వివరాల్లోకి వెళ్తే. కర్నూలు జిల్లా అవుకు పట్టణానికి చెందిన మూల లక్ష్మీనారాయణగౌడ్, మూల రమాదేవి దంపతుల కుమారుడు శ్రీనివాసులు గౌడ్, అలగాని నారాయణ గౌడ్, లక్ష్మీదేవి దంపతుల కుమారై శ్రీవాణి వివాహం సోమవారం జరిగింది. పెళ్లికుమారుడిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అలంకారంలో కిరీటం, నుదట తిలకం, చేతులకు ఆభరణాలు, పట్టువస్త్రాలు, హారాలతో అలంకరించారు. పెళ్లికూతురి అలంకారంలో పట్టువస్త్రాలు, కిరీటం, బంగారు ఆభరణాలతో సాక్షాత్తు లక్ష్మీదేవిలా అలంకరించారు. అచ్చం దేవతామూర్తుల పెళ్లిలా వీరి వివాహ వేడుక జరిగింది. వధూవరులకు దేవతామూర్తుల అలంకరణ చేసి పెళ్లిపీటలపై కూర్చోబెట్టడంతో పెళ్లికి హాజరైన బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అంతలోనే తేరుకుని దేవతామూర్తుల వేషధారణలో ఉన్న నూతన వధూవరులను ఆశీర్వదించి విందు ఆరగించి వెళ్లారు. స్థానిక కాశీవిశే్వశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఈ వివాహ వేడుక అవుకులో చర్చనీయాంశంగా మారింది.

*చిత్రం... దేవతామూర్తుల అలంకరణలో నూతన వధువరులు