ఆంధ్రప్రదేశ్‌

లక్ష్మీపురంలో జల్లికట్టులో పలువురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, జనవరి 28: చిత్తూరు జిల్లా కుప్పం మండలం లక్ష్మీపురంలో మంగళవారం జరిగిన జల్లికట్టులో పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల ఆంక్షలను సైతం లెక్క చేయకుండా నిర్వాహకులు జల్లికట్టును నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులను సుందరంగా అలంకరించి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పశువులను పరిగెత్తించారు, వీటిని నిలువరించేందుకు పలువురు యువకులు పోటీపడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ జల్లికట్టులో ఎద్దుకు రెండు కాళ్లు విరిగాయి. ఈవిషయాన్ని తెలుసుకొన్న పోలీసులు లక్ష్మీపురానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.