ఆంధ్రప్రదేశ్‌

అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు: కేశినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), జనవరి 28: మూడు రాజధానుల ప్రతిపాదనతో మొండిగా ముందుకు వెళుతున్న వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని ఒక అంగుళం కూడా కదల్చలేదని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. పాలనా వికేంద్రీకరణ పేరుతో కర్నూలుకు హైకోర్టును కూడా తరలించడం సాధ్యం కాదని మంగళవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. శాసన మండలిని రద్దుచెయ్యాలనే ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదిన జరిగే పని కాదన్నారు. కేంద్ర న్యాయ శాఖ పరిధిలో దీనికి ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయని, అందుకే రాజధాని అమరావతిని ఒక అంగుళం కూడా కదల్చలేరని కేశినేని స్పష్టం చేశారు.