ఆంధ్రప్రదేశ్‌

నేడు పీసీసీ రథసారథుల పదవీ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 28: పీసీసీ నూతన అధ్యక్షుడు శైలజానాధ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు తులసిరెడ్డి, మస్తాన్ వలీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పదవీ స్వీకారం చేయనున్నారు. ఇందుకు రాష్ట్ర నలుమూలల నుండి భారీ ఎత్తున జన సమీకరణకై నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఊమెన్ చాందీ, కార్యదర్శులు క్రిష్ట్ఫోర్ తిలక్, మెయ్యప్పన్, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి, జాతీయ నాయకులు, ఏఐసీసీ ప్రముఖులు, మహిళా నేత సుస్మితాదేవ్, కర్నాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు, సీడబ్ల్యుసీ సభ్యుడు మునియప్ప, తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి, తెలంగాణ సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, సీనియర్ నాయకులు మధూయాష్కి, రాజ్యసభ సభ్యులు కేవీవీ రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి తదితరులు హాజరుకానున్నారన్నారు.