ఆంధ్రప్రదేశ్‌

ఏపీకి జపాన్ సాంకేతికత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 29: ఇంధన సామర్థ్య రంగంలో రాష్ట్రానికి జపాన్ అధునాతన సాంకేతికతను అందజేసేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ టెరీ (దీ ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్) సంసిద్ధత వ్యక్తం చేసింది. చౌక విద్యుత్ సాధన, వేగవంతమైన పారిశ్రామిక పురోగతి, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో (ఎస్‌ఎంఈ) 33-35 శాతం వరకు కర్బన ఉద్గారాలను తగ్గించి వాటిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ సాంకేతికత దోహదపడుతుందని టెరీ వెల్లడించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ స్ట్రాటజీస్ (ఐజీఈఎస్)తో కలిసి టెరీ సంస్థ బుధవారం ఢిల్లీలో నిర్వహించిన వరల్డ్ సస్టయినబుల్ డెవలప్‌మెంట్ సమ్మిట్ 2020 సందర్భంగా టెరీ డైరెక్టర్ జనరల్ అజయ్ మాథుర్ మాట్లాడుతూ వేగవంతమైన
పురోగతిని ఆశిస్తున్న ఆంధ్రప్రదేశ్ లాంటి క్రియాశీలక రాష్ట్రాలకు ఇంధన సామర్థ్యం (ఎనర్జీ ఎఫీషియన్సీ) దీర్ఘకాలంలో ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. జపాన్- ఇండియా టెక్నాలజీ మ్యాచ్ మేకింగ్ ప్లాట్‌ఫాం (జేఐటీఎంఏపీ) ద్వారా ఐజీఈఎస్‌తో కలిసి టెరీ సంస్థ ఈ ఎనర్జీ ఎఫీషియన్సీ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్‌కు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఇది పారిశ్రామిక రంగానికి ప్రత్యేకించి చిన్న , మధ్య తరహా పరిశ్రమలకు ఒక వరం లాంటిదన్నారు.
విద్యుత్ రంగానికి సంబంధించి సరఫరా, డిమాండ్‌ల మధ్య వ్యత్యాసాన్ని పూరించటంలో ఇంధన సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అందుకోవటానికి అదనపు విద్యుత్ ఉత్పత్తి లేదా అదనపు స్థాపన సామర్థ్యం పెంచుకోవటం చాలా వ్యయంతో పాటు కాల వ్యవధితో కూడిన అంశమని వివరించారు. అయితే ఇంధన సామర్థ్యం ఇందుకు సరైన ప్రత్యామ్నాయ పరిష్కారంగా నిలుస్తుందని చెప్పారు. పైగా విద్యుత్ లభ్యతతో సంబంధం ఉన్న అభివృద్ధి లక్ష్యాల విషయంలో ఎక్కడా రాజీపడాల్సిన అవసరంలేదని, ప్రజాధనాన్ని ఆదా చేయగలుగుతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎనర్జీ ఎఫీషియన్సీ అమలు పెద్దఎత్తున చేపట్టగలిగితే వ్యవసాయాధారితంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు పెద్దఎత్తున లబ్ధిపొందుతాయని తెలిపారు. పరిశ్రమలకు సరిపోను నాణ్యమైన విద్యుత్‌ను అందించవచ్చని, అదే సమయంలో పర్యావరణంపై కాలుష్య ప్రభావాన్ని నియంత్రించ వచ్చన్నారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగంలో విద్యుత్ వినియోగం తగ్గుతున్న నేపథ్యంలో అందుబాటు ధరల్లోనే నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటూ ఇంధన సామర్థ్య కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టెరీ చీఫ్ అభినందించారు.
ఇదిలా ఉంటే ఎనర్జీ ఎఫీషియన్సీ అమల్లో క్రియాశీలకంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, యూపీ లాంటి రాష్ట్రాల్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో నూతన జపాన్ సాంకేతికతను అమలు చేసేందుకు టెరీ ఆసక్తితో ఉందన్నారు. ఏపీలోని మత్స్య పరిశ్రమ, కోల్డ్ స్టోరేజ్, ఖనిజ పరిశ్రమలు తదితర వాటిలో ఈ సాంకేతికతను అమలు చేసే అవకాశం ఉన్నట్లు ఇంతకు ముందు టెరీ చేసిన ఆధ్యయనంలో వెల్లడైందని తెలిపారు. ఏపీలో మోడల్ ప్రాజెక్ట్‌లు చేపట్టేందుకు ముందుకు రావాల్సిందిగా ఐజీఈఎస్‌ను కోరారు. వీటిలో రాష్ట్ర ఇంధన పరిరక్షణ సంస్థ (ఏపీఎస్‌ఈసీఎం) భాగస్వామి కావాలని సూచించారు. ఆర్థిక వృద్ధికి ఎస్‌ఎంఈ రంగం పునాదివంటిదని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించ గలిగే సామర్థ్యం ఈ రంగానికి ఉందని వివరించారు. ఎస్‌ఎంఈ సెక్టార్‌లో ఎనర్జీ ఎఫీషియన్సీ అమలుకు ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యూనీడో) జీఈఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు పెద్దఎత్తున నిధులు సమకూరుస్తునుట్ల అజయ్ మాథుర్ తెలిపారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ), ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) వంటి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా దేశంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
కార్యక్రమానికి హాజరైన ఏపీఎస్‌ఈసీఎం ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏ చంద్రశేఖర్‌రెడ్డి సదస్సులో ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ సందేశాన్ని చదివి వినిపించారు. చౌక విద్యుత్ సాధన లక్ష్యానికి ఏపీ కట్టుబడి ఉందని, విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్య వెనుక పరమార్థం ఇదేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రైతులు, పేద వర్గాలకు మేలు కలిగేలా విద్యుత్ రంగంలో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. విద్యుత్ రంగాన్ని ఆర్థికంగా శక్తివంతం చేసేందుకు, ఈ రంగంలో సుస్థిరత సాధించేందుకు, డిస్కంల ఆర్థిక పరిపుష్టి, పారిశ్రామిక రంగ పురోగతి, ఆర్థికాభివృద్ధికి, అంతిమంగా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు చౌక విద్యుత్ సాధనే అత్యంత కీలకమని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో ఎనర్జీ ఎఫీషియన్సీ తనవంతు పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంధన సామర్థ్య కార్యక్రమాలను ఏపీఎస్‌ఈసీఎం సీఈఒ ఈ సందర్భంగా వివరించారు. ఎస్‌ఎంఈలలో ఇంధన వినియోగం, ఇంధన వ్యయం తగ్గుదలకు ఎనర్జీ ఎఫీషియన్సీ దోహదపడుతుందని చెప్పారు. ఈ సదస్సులో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ (బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ భక్రే, ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంటల్ స్ట్రాటజీస్ (ఐజీఈఎస్) ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కజుహికో టికుచి, యునిడో ప్రతినిధి డాక్టర్ రెనే వాన్ టెర్కిల్, సీనియర్ ప్రతినిధి మిస్టర్ కెంగో అకామైన్ పాల్గొన్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ఐసీఈఎస్, కాన్సాయ్ రీసెర్చ్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ తోపిజో మైడా, లార్డ్ అడైర్ టర్నర్, చైర్, ఎనర్జీ ట్రాన్స్‌మిషన్ కమిషన్, యూకె ప్రొఫెసర్ ఎస్‌శీ శ్రీవాస్తవ, ఐఐటీ కాన్పూర్, ఇంకా 21 దేశాలకు చెందిన నిపుణులు, ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు.

*చిత్రం... ఢిల్లీలో బుధవారం జరిగిన సదస్సులో ఇంధన సామర్థ్య పోస్టర్ విడుదల చేస్తున్న టెరీ డైరెక్టర్ జనరల్ అజయ్‌మాథుర్, తదితరులు