ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 29: పాలనా రాజధానిగా ప్రతిపాదిస్తున్న విశాఖపట్నంలో పేదలకు భారీగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. బుధవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విశాఖ మునిసిపల్ కార్పొరేషన్, హౌసింగ్ అధికారులతో కొద్దిసేపు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్టవ్య్రాప్తంగా 25 లక్షల మంది పేదలకు ఉగాది పండుగ రోజున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖ నగరంలో లక్ష మందికి పట్టాలు పంపిణీ చేయాలని భావిస్తోంది. నగరంలో ఆవాస యోగ్యమైన స్థలాలను గుర్తించి మార్కింగ్ ఇవ్వాలని, ఫిబ్రవరి 15వ తేదీ లోగా భూ సేకరణ పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. లబ్ధిదారులు కోరుకున్న స్థలాలను సేకరించాలన్నారు. ప్లాటింగ్ అనంతరం లాటరీ పద్ధతిలో పట్టాలు పంపిణీ చేయాలన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ కార్యక్రమంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

*చిత్రం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి