ఆంధ్రప్రదేశ్‌

కుసుమ ధర్మన్న సాహిత్య పీఠం ఏర్పాటుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 18: దళిత సాహిత్య వైతాళికుడు కుసుమ ధర్మన్న సాహిత్య పీఠాన్ని తెలుగు విశ్వ విద్యాలయంలో స్థాపించాలని కవులు, మేధావులు, రచయితలు ప్రతిపాదించారు. రాజమహేంద్రవరంలో ‘కుసుమాంజలి’ పేరిట కుసుమ ధర్మన్న సాహితీ సమాలోచన ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్సీ శర్మ మాట్లాడుతూ కుసుమ ధర్మన్న సాహిత్య పీఠాన్ని స్థాపించడానికి కృషిజరుగుతోందని, ఇందుకు ప్రజా ప్రతినిధులంతా తోడ్పాటునందించాలని కోరారు. మను ధర్మానికి దీటైనది కుసుమ ధర్మన్న శాస్తమ్రన్నారు. కుసుమ ధర్మన్న జీవితంపై పరిశోధనలు సాగాలన్నారు. ధర్మన్న రాసిన ‘మాకొద్దీ నల్ల దొరతనం’ అనే పాటను పాఠశాలల్లో విధిగా పాడించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. మాజీ ఎంపి మిడియం బాబూరావు మాట్లాడుతూ కుసుమ సాహిత్య కృషి నేటికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన కృషిని ముందుకు తీసుకెళ్ళడమే ధ్యేయంగా అందరూ పనిచేయాలన్నారు. సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి కుసుమ ధర్మన్న రచించిన పుస్తకాలను విశే్లషించారు. ఆదికవి పుట్టిన చోటే ఆది ఆంధ్రా కవి పుట్టాడన్నారు. డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ అంతరిక్షానికి దగ్గరవుతున్నా అంటరానితనానికి దూరం కాలేకపోతున్నామన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ త్యాగమే శాశ్వతమన్నారు. సదస్సులో ముందుగా కుసుమ ధర్మన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ఇ. విజయపాల్ అధ్యక్షత వహించారు. కుసుమ ధర్మన్న రచనలను, కుసుమ ధర్మన్న జీవితంపై పరిశోధన చేసిన ప్రొఫెసర్ పుట్ల హేమలత రాసిన పుస్తకాన్ని, కవి శిఖామణి రాసిన కవితా సంపుటిని కుసుమ ధర్మన్న కుటుంబ సభ్యులు మనుమడు ప్రసాద్, మనుమరాలు రాజకుమారి, కోడలు అమ్మాజీ, బోయి భీమన్న కుమార్తె విజయభారతి, ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్, సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి తదితరులు ఆవిష్కరించారు. ప్రజా నాట్యమండలి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే చిట్టూరి ప్రభాకర్ చౌదరి, ముప్పాళ్ళ సుబ్బారావు, వేముల ఎల్లయ్య, ఆశాజ్యోతి, జివి. రత్నాకర్, రూఫస్ కుమార్, గూటం స్వామి, ముద్దుకూరి సత్యనారాయణ, సన్నిధానం నర్శింహ శర్మ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కుసుమ ధర్మన్న సామాజిక సాహిత్య నేపథ్యం, దళితులు-వర్తమానం-కుసుమ ధర్మన్న అనే అంశాలపై సదస్సు జరిగింది. కుసుమ ధర్మన్న జీవితంపై, సాహిత్యంపై నృత్య రూపకంపై ప్రజా నాట్యమండలి రాష్ట్ర నాయకుడు నిఖిలం సురేష్ గేయాలాపాన ఆకట్టుకుంది.