ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ దీక్ష సక్రమమైతే పదవికి రాజీనామా చేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 18: కాపుల సంక్షేమం కోసం అంటూ ముద్రగడ పద్మనాభం ఏడు రోజులపాటు చేపట్టిన దీక్ష బూటకమని, దీనిపై సిబిసిఐడితో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగుచూస్తాయని కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు అన్నారు. బలిజ కాపుల వెనుకబాటుతనంపై అధ్యయనం చేయడానికి సోమవారం జస్టిస్ మంజునాథ కమిషన్ తిరుపతికి రానున్న నేపథ్యంలో రామాంజనేయులు ఆదివారం తిరుపతి విచ్చేశారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం వయస్సు 64 ఏళ్లు అన్నారు. 64 ఏళ్ల వయసున్నవారు ఏడు రోజులపాటు అన్నాహారాలు మానేస్తే ఎంతటి ఆరోగ్యవంతమైన వ్యక్తికైనా బిపి, షుగర్ స్థాయి పడిపోవడం తథ్యమన్నారు. ప్రపంచంలో ఏ నిష్ణాతుడైన డాక్టర్‌ను అడిగినా ఇదే విషయాన్ని చెబుతారన్నారు. ఈ పరిస్థితుల్లో పద్మనాభం దీక్షబూనిన సమయంలో ఆయనకు ఇలాంటి పరిస్థితిలేవీ ఎదురుకాలేదన్నారు. దీనినిబట్టిచూస్తే ఆయన సక్రమంగా దీక్ష చేయలేదనే అర్ధమవుతోందన్నారు. ఈ సంఘటనపై సిబిసిఐడి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు. ఆయన దీక్ష నిజమని విచారణలో తేలితే తాను తన పదవికి రాజీనామా చేస్తానని, బూటకమని తేలితే ఆయన ఉద్యమం నుంచి తప్పుకుంటారా అని ఆయన సవాల్ విసిరారు.