ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధికి డ్రోన్ల దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18:రానున్న రోజుల్లో రాష్టమ్రంతటా రియల్‌టైమ్ గవర్నెన్స్ కింద డ్రోన్‌లు, నిఘా కెమెరాల పర్యవేక్షణ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ డ్రోన్ అప్లికేషన్‌ల వినియోగంపై ఆదివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఎపి స్టేట్ ఫైబర్ నెట్‌వర్క్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో డ్రోన్ టెక్నాలజీని పెద్దఎత్తున వినియోగించుకుంటున్నందున ప్రాథమికంగా పర్యాటకరంగం, వ్యవసాయ అనుబంధ రంగాలు, గనులు, అడవులు, వివిధ ప్రాజెక్టులు, శాంతిభద్రతలు, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధితోపాటు తుఫాన్‌లు, వరదలు వంటి విపత్తుల నిర్వహణ వంటి అంశాల్లో డ్రోన్ల వినియోగం ద్వారా పర్యవేక్షించి సకాలంలో మెరుగైన సేవలు అందించేందుకు ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం జరుగుతుందని తెలిపారు.
ప్రతి జిల్లాలో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతోపాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం నగరాల్లో నగరస్థాయి కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటు వాటన్నిటినీ అమరావతి రాష్టస్థ్రాయి కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ద్వారా సకాలంలో అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా కృషి చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
అంతకుముందు ఎపి ఫైబర్‌గ్రిడ్ ఎండి సాంబశివరావు రియల్ టైమ్ గవర్నెన్స్‌లోడ్రోన్ అప్లికేషన్ వినియోగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ జపాన్ దేశం పంటలపై స్ప్రేయింగ్‌కు డ్రోన్‌లను వినియోగిస్తోందని తెలిపారు. అలాగే అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ దేశాలు వ్యవసాయం, పంటల అంచనాలో వీటిని వినియోగిస్తున్నాయని తెలిపారు. అక్రమ మైనింగ్ నియంత్రణకు, జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారుల నిర్వహణకు డ్రోన్‌ల ద్వారా పర్యవేక్షణ ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పారు.