ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి కేంద్రం షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. రాష్ట్భ్రావృద్ధికి అన్ని విధాలా సాయం చేస్తామంటూ పదే పదే చెప్తూనే, నిబంధనల పేరుతో నిర్దయగా వ్యవహరిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి వందకోట్ల డాలర్ల రుణానికి గ్యారంటీ ఇచ్చేందుకు మొద ట్లో సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్రం ఇప్పుడు ఆ రుణ మొత్తాన్ని ఏకంగా సగానికి తగ్గించి కేవలం 50కోట్ల డాలర్లకే అంగీకరించింది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకే విడతలో ఇంత మొత్తానికి గ్యారెంటీ ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేసింది. ‘‘రాజధాని నిర్మాణానికి వంద కోట్ల కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ వంద కోట్ల డాలర్ల రుణానికి గ్యారంటీ ఇచ్చేందుకు మొదట్లో సూత్రప్రాయంగా అంగీకరించినా, నియమాలు అంగీకరించవంటూ దాన్ని సగానికి తగ్గించింది’’ అని ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న అధికారి ఒకరు తెలిపారు. అమరావతి తొలి దశ నిర్మాణానికి 500 కోట్ల డాలర్ల రుణం ఇవ్వాల్సిందిగా భారత ప్రభుత్వం నుంచి తమకు లేఖ అందిందని ప్రపంచ బ్యాంకు అధికారి ధ్రువీకరించారు. ‘‘రాజధాని ప్రాజెక్టు రూపకల్పనకు సంబంధించి ప్రస్తుతం రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సిఆర్‌డిఏ)తో సంప్రదింపులు జరుగుతున్నాయి.’’ అని ఆ అధికారి తెలిపారు.
ఎన్జీటీతో లిటిగేషన్
రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఇచ్చే ఈ 500 కోట్ల డాలర్ల రుణానికీ, జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జిటి)లో పెండింగ్‌లో ఉన్న కేసు అడ్డంకిగా మారనుంది. ఇప్పటికే రుణ ప్రతిపాదనను ప్రపంచ బ్యాంకు యథాతథ స్థితిలో ఉంచినట్లు సమాచారం. భారత్‌లో ప్రపంచ బ్యాంకు చీఫ్ రఘు కేశవన్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే రెండు సార్లు అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించింది. అయితే ఎన్‌జిటి క్లియరెన్స్ లభించేదాకా ప్రపంచ బ్యాంకు రుణానికి మంజూరు ఇవ్వదని సిఆర్‌డిఏ అధికారులు అందోళన చెందుతున్నారు. ‘‘పర్యావరణానికి సంబంధించి వివిధ అంశాలను ఇప్పటికే వివరించాం. రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని వారు ఇప్పటికే సందర్శించారు. వీలైనంత త్వరగా రుణాన్ని మంజూరు చేయాలని వారిని కోరాం. ఒక వేళ రుణం ఆలస్యమైనా, తిరస్కరించినా అమరావతి తొలిదశ నిర్మాణం, అభివృద్ధికి విఘాతం కలుగుతుంది.’’ అని సిఆర్‌డిఏ అధికారి ఒకరు వెల్లడించారు.