ఆంధ్రప్రదేశ్‌

నేడు మరోసారి ఢిల్లీకి జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మళ్లీ ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయి 24 గంటలు తిరక్కముందే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యేందుకు అపాయింట్‌మెంట్ ఖరారు కావటంతో శుక్రవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు అమిత్‌షాతో జగన్ భేటీ అవుతారు. రాష్ట్ర విభజన అంశాలు, ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, మండలి రద్దు తదితర అంశాలపై ప్రధానమంత్రితో బుధవారం సుమారు రెండు గంటల పాటు చర్చించిన ముఖ్యమంత్రి అదే రోజు రాత్రి అమిత్‌షాను కూడా కలవాలని భావించారు. అయితే ఆయన ఢిల్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బిజీగా ఉండటంతో అపాయింట్‌మెంట్ వాయిదా పడింది. దీంతో జగన్ తాడేపల్లి తిరిగి వచ్చారు. శుక్రవారం అమిత్‌షా అపాయింట్‌మెంట్ దొరకటంతో విభజన అంశాలు, దిశ చట్టం, మండలి రద్దుకు పార్లమెంట్ ఆమోదం తెలపాల్సిందిగా అమిత్‌షాను
కోరనున్నారు. దీంతో పాటు రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీబీఐచే విచారణ జరపాలని పార్లమెంట్ సమావేశాల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని కూడా అమిత్‌షా దృష్టికి తీసుకు వెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. మూడు నెలల తరువాత ప్రధానితో పాటు అమిత్‌షా అపాయింట్‌మెంట్లకు ముహూర్తం కుదరటంతో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని అధికారపార్టీ నేతలు ఆశిస్తున్నారు. గత మూడు నెలల క్రితం మూడు సార్లు ప్రధాని, అమిత్‌షా అపాయింట్‌మెంట్ దొరక్క జగన్ ఢిల్లీ నుంచి తిరిగొచ్చారు. దీంతో కేంద్రం వైసీపీని దూరం పెడుతోందనే ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్డీయేలో వైసీపీ భాగస్వామ్యం పంచుకోవటంతో పాటు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోందనే సంకేతాలు అందుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర నిధులు మరిన్ని తీసుకువచ్చేలా సంప్రతింపులు జరపటానికే సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తారని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. ప్రత్యేక హోదా మాటెలా ఉన్నా రాష్ట్రానికి పన్నుల వాటాపైనే ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. కేంద్రంతో సయోధ్య పెంచుకోవటం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులకు అవరోధాలు ఉండవని భావిస్తోంది. ఏది ఏమైనా అమిత్‌షాతో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకోనుంది.