ఆంధ్రప్రదేశ్‌

ఉన్నత ప్రమాణాలతోనే యూనివర్సిటీల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 13: విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు పెంచితేనే యూనివర్సిటీల అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం అనంతపురం జేఎన్‌టీయూ ఆడిటోరియంలో రెండవ టెక్ వీసీ కన్‌క్లీవ్- 2020 ఇన్‌వెన్‌టివ్ ఎక్స్‌లెన్స్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌పై రెండు రోజుల ఉపకులపతుల సదస్సు ప్రారంభమైంది. జేఎన్‌టీయూ అనంతపురం, కర్లాటకలోని బెల్‌గావ్ విశే్వశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ, న్యూఢిల్లీ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐటీఈసీ), బెంగళూరు ఎల్‌ఐహెచ్ అకాడమి ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్మెన్ నందమూరి లక్ష్మీపార్వతి, ఏపి హయ్యర్ ఎడ్యుకేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర, ఏపీ స్టేట్ కౌన్సిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మెన్ హేమచంద్రారెడ్డి, ఏఐసీటీఈ ఛైర్మెన్ అనిల్ సహస్త్ర బుద్దే, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సెక్రెటరీ జనరల్ పంకజ్ మిట్టల్, నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ ఛైర్మెన్ అగర్వాల్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మెంబర్ రామచంద్రన్, ఆర్‌జియు కెటీ ఛాన్స్‌లర్ కెసి రెడ్డి, విశే్వశ్వరయ్య టెక్నాలజీ యూనివర్సిటీ వీసీ కరిసిద్దప్ప, జెఎన్‌టియూ వీసీ శ్రీనివాసకుమార్, మాజీ ఏపీపీయస్సీ ఛైర్మెన్ వెంకటరామిరెడ్డి హాజయ్యారు. ఈ సందర్భంగా సతీష్ చంద్ర, సహస్ర బుద్దే, పంకజ్ మిట్టల్, అగర్వాల్, కరిసిద్దప్ప మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో విద్య చాలా ముఖ్యమని, నాణ్యమైన విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. విద్యావ్యవస్థలో నాణ్యతతో కూడిన నైపుణ్యాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అన్ని రంగాల్లో నూతన టెక్నాలజీని జోడించి విద్యను బోధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూనివర్సిటీల పరిధిలోని కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు పెంపొందించి, నూతన విద్యావిధానం అమలు చేస్తే విద్యార్థులకు అనువుగా ఉంటుందన్నారు. అలాగే పాత విధానంలో బోధించడం వల్ల సబ్జెక్టుపై విద్యార్థులకు సరైన అవగాహన కలగడం లేదన్నారు. నూతన టెక్నాలజీని జోడించి బోధిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు.
టెక్నాలజీకి అనుగుణంగా నూతన పరిశోధనలవైపు దృష్టి సారించేందుకు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.