ఆంధ్రప్రదేశ్‌

ఏమిటీ నిర్లక్ష్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 13: పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలి ప్రతిపాదించిన సెలక్ట్ కమిటీ ఏర్పాటు చెల్లదని మండలి కార్యదర్శి చేస్తున్న వాదనలపై చైర్మన్ షరీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో జరిగిన శాసనసభ సమావేశాల సందర్భంగా మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లులను అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపింది. ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిస్తూ రూల్ నెం. 154 ప్రకారం విచక్షణాధికారాలతో నిర్ణయం తీసుకున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు. కమిటీలో సభ్యుల పేర్లు పంపాల్సిందిగా రాజకీయ పార్టీలకు లేఖలు కూడా రాశారు. ఇందులో భాగంగా అధికార పార్టీ మినహా ప్రతిపక్ష తెలుగుదేశం, బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీల పేర్లను ప్రతిపాదిస్తూ ఆయా పార్టీలు చైర్మన్‌కు లేఖలు పంపాయి. వీటిని మండలి కార్యదర్శికి పంపి సెలక్ట్ కమిటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని చైర్మన్ షరీఫ్ ఆదేశించారు. అయితే ఇది చెల్లదంటూ కార్యదర్శి ఇటీవలే దాన్ని వెనక్కు పంపారు. దీనిపై మండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం రాత్రి ఈ ఫైలింగ్ సిస్టం ద్వారా కార్యదర్శికి సెలక్ట్ కమిటీ ఏర్పాటుపై లేఖ రాశారు. దీంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సారి కూడా సెలక్ట్ కమిటీ ఏర్పాటు అంశాన్ని తిప్పి పంపితే ధిక్కరణ నోటీసు ఇచ్చి చర్యలు తీసుకోవాలని చైర్మన్ భావిస్తున్నట్లు తెలియవచ్చింది. శాసనమండలిలో ఓటింగ్ జరగలేదు కనుక సెలక్ట్ కమిటీ ఏర్పాటు చెల్లదని అధికార పార్టీ వాదిస్తోంది. అయితే దీనికి ఓటింగ్ సాధ్యంకాదని, సెలక్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత ఆ ప్రక్రియను కార్యదర్శి పూర్తి చేయాల్సిందేనని చైర్మన్ షరీఫ్ స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ అలా జరక్కపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఉందన్నారు. శాసనమండలి ఇంకా రద్దు కాక పోవటంతో నిబంధనలు వర్తిస్తాయనే ప్రచారం జరుగుతోంది.