ఆంధ్రప్రదేశ్‌

రాజధాని మార్చినా తాత్కాలికమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 15: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధానిని మార్చినా అది తాత్కాలికమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే అందుకు వైసీపీ కూడా మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పుడు మాట తప్పి రాజధాని మారుస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అసలు 2014లోనే రాజధాని నిర్ణయం జరిగిందన్నారు. రాజధాని ప్రాంతంలో గత 60 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రైతులకు భరోసా కల్పించేందుకు పవన్ రాజధాని గ్రామాల్లో శనివారం విస్తృతంగా పర్యటించారు. ఎర్రబాలెం, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం, వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో పర్యటించిన పవన్.. రైతులు, మహిళలు చేస్తున్న దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం ప్రకటించారు. పవన్ మాట్లాడుతూ రాజధాని 29 గ్రామాల సమస్య మాత్రమే కాదని ఐదు కోట్ల ఆంధ్రులతో ముడిపడిన అంశమని గుర్తించాలన్నారు. తన స్వార్థం, స్వలాభం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకోలేదని వివరించారు. రాజధాని రైతులకు మద్దతుగా బీజేపీ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. యుపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఆధార్‌కార్డును ఎన్డీఏ వ్యతిరేకించిందని, తర్వాత అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీని పక్కనబెట్టకుండా మరింత బలంగా ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములు రాజధాని కోసం రైతులు త్యాగం చేశారన్నారు. రైతులు భూములు ఇచ్చింది రాజధాని కోసమే తప్ప వైసీపీ నవరత్నాల కోసం కాదన్నారు. టీడీపీతో గొడవలు ఉంటే వారితో తేల్చుకోవాలే తప్ప రైతులను ఇబ్బందులకు గురి చేయడం ఏం న్యాయమని పవన్ ప్రశ్నించారు. రాజధాని అనేది ఒక సామాజికవర్గానికి చెందిన అంశంగా ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో అన్ని సామాజికవర్గాలు, మతాలకు చెందిన వారు ఉన్నారని పేర్కొన్నారు. రాజధాని మార్పు నిర్ణయంతో మనస్థాపానికి గురై 41 మంది మృతిచెందారని, అవన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుందన్నారు.

*చిత్రం...రైతుల దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న జనసేనాని పవన్‌కళ్యాణ్