ఆంధ్రప్రదేశ్‌

రాజకీయ లబ్ధికి బాబు పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా ఏదో ఒకరకంగా రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుండి ఏదోవిధంగా వైసీపీపై బురదజల్లాలని టీడీపీ ప్రయత్నిస్తూ వస్తోందన్నారు. ఇందులోభాగంగానే ఎన్డీఏతో కలుస్తున్నారంటూ తమపై విషప్రచారం చేస్తోందని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని మైనార్టీలకు దూరం చేయాలని తెలుగుదేశం పెద్దలు కుట్రలు చేస్తున్నారని, తాము ఎన్డీఏతో కలవాలని ఏనాడూ భావించలేదని చెప్పారు. ఎన్నికలకు ముందు కూడా ఇదే ప్రచారాన్ని టీడీపీ నేతలు సాగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. టీడీపీ నేతల విషప్రచారాన్ని నమ్మి బీజేపీ, జనసేన నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని, తాము ఎన్డీఏలో భాగస్వాములం అవుతామని ఏనాడూ ఢిల్లీ పెద్దలను కోరలేదని స్పష్టం చేశారు. ఐటీ శాఖ సోదాలతో చంద్రబాబు అక్రమాలు బయటపడ్డాయని, వ్యక్తుల కోసం వ్యవస్థను నాశనం
చేస్తున్నారని విమర్శించారు. సాక్షాత్తు ఐటీ శాఖ ఇచ్చిన వివరాలను కూడా తప్పుబడుతున్నారని, ఆరురోజుల సోదాల్లో రెండు లక్షలు మాత్రమే సీజ్ చేశారనడం కేవలం టీడీపీ వారికే చెల్లిందన్నారు. నిజంగానే రెండు లక్షలు సీజ్ చేస్తే, తనవద్ద పనిచేసిన పీఎస్ ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేసినపుడు చంద్రబాబు, లోకేష్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఐటీ శాఖ వెల్లడించిన మూడు కంపెనీలు టీడీపీవేనని ఆరోపించారు. ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడికి చెందిన కంపెనీ, లోకేష్ స్నేహితుడు కిలారి రాజేష్ కంపెనీ, కడపకు చెందిన శ్రీనివాసరెడ్డి కంపెనీలలో సోదాలు జరిగాయన్నది నిజంకాదా అని బొత్స ప్రశ్నించారు. గత ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు పంచభూతాలను పంచుకుతినేశారని, ఎవరి స్థాయిలో వారు అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు. దోచుకోడానికే అమరావతిని సృష్టించారని తాము ప్రతిపక్షంలో ఉన్నపుడే చెప్పామని గుర్తుచేశారు. అందినకాడికి చంద్రబాబు, ఆయన బినామీలు దోచుకున్నారు కనుకనే ప్రజలు వారిని తిరస్కరించారన్నారు. గృహ నిర్మాణ శాఖలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.400 కోట్లను ఆదా చేశామని, ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ధ్యేయమని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
*చిత్రం... రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ