ఆంధ్రప్రదేశ్‌

స్వచ్ఛ్భారత్ మిషన్ జాబితాలో తిరుమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 19: కేంద్రప్రభుత్వం స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన 10 ఆదర్శనీయమైన ప్రాంతాల్లో ఒకటిగా తిరుమల గుర్తింపు పొందిందని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు వెల్లడించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం జరిగిన అధికారుల సమావేశంలో ఇఓ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 100 ఆదర్శనీయ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిందన్నారు. మొదటి విడతలో ఎంపిక చేసిన 10 ప్రాంతాల్లో తిరుమల కూడా ఉందని తెలిపారు. తిరుమలను మరింత ఆదర్శనీయ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వరంగ సంస్థలైన కోల్ ఇండియా, ఓఎన్‌జిసి తదితర సంస్థలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతగా నిధులు మంజూరు చేస్తాయన్నారు. ఇందుకోసం తిరుమలలో చేపట్టాల్సిన పలు రకాల అభివృద్ధి పనులకు సంబంధించి 26 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ఈ సంస్థలకు పంపుతామన్నారు. తిరుమలలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్ ద్వారా ప్రస్తుతం రోజుకు 20 ఎంఎల్‌డిల నీటిని శుద్ధిచేసి తిరిగి వినియోగిస్తున్నామని ఇఓ తెలిపారు. మరో ఐదు ఎంఎల్‌డిల నీటిని శుద్ధి చేయడం ద్వారా ఉద్యానవనాలు, శ్రీ గంధం మొక్కలు, ఘాట్‌రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకానికి అవసరమైన నీరు సమకూరుతుందని, ఇందుకోసం 6 కోట్లు ఖర్చు అవుతుందని వెల్లడించారు. ఘనవ్యర్థాల నిర్వహణకు సంబంధించి 1.50 కోట్లు అవసరమవుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న విద్యుత్ బల్బుల స్థానంలో ఎల్‌ఇడి బల్బులను అమర్చేందుకు 5.50 కోట్ల రూపాయలు కావాల్సి ఉందని చెప్పారు. కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, బ్యాటరీ కార్లను వినియోగించాల్సి ఉందని, ఇందుకోసం ఆరు కోట్లు అవసరమవుతుందని తెలిపారు.