ఆంధ్రప్రదేశ్‌

నేషనల్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆరుగురు ఆంధ్రా క్రీడాకారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 16: ఈ ఏడాది మేలో జరిగే జాతీయ చదరంగం పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. జాతీయ చదరంగం పోటీల్లో గెలుపొందిన వారు ఏషియన్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చెస్ అసోసియేషన్, పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్, భీమవరం చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-9 ఓపెన్, బాలికల రాష్టస్థ్రాయి చదరంగం పోటీలు నిర్వహించారు.
మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో ప్రతిభ కనపరచిన ఆరుగురు క్రీడాకారులు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. బాలికల విభాగంలో 1120 ఇంటర్నేషల్ ర్యాంకింగ్‌తో అత్యధిక పాయింట్లు సాధించిన కొలగొట్ల ఆలనా మీనాక్షి (విశాఖపట్నం), 1007 ర్యాంకింగ్ కలిగిన కఠారి సజోత్స్న (కడప), 1090 ర్యాంకింగ్ కలిగిన పూజా తంపెల్లీ (కృష్ణ), శనివరపు హాసిని (కర్నూలు) జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఓపెన్ కేటగిరి నుంచి 1109 ర్యాంకింగ్ కలిగిన కొల్లా భవాన్ (కృష్ణ), 1075 ర్యాంకింగ్ కలిగిన పీలా విష్ణువర్థన్ (విశాఖపట్నం) ఎంపికయ్యారు. అత్యధిక పాయింట్లు సాధించి, నేషనల్ చెస్ టోర్నమెంటుకు ఎంపికైన క్రీడాకారులకు ఇంటర్నేషనల్ చెస్ ఆర్బిటర్ అనంతరామన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రో వైస్ ఛైర్మన్ వత్సవాయి శ్రీనివాసరాజు, రాష్ట్ర చెస్ అసోసియేషన్ కార్యదర్శి సుమన్, పశ్చిమ గోదావరి జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట భోగయ్య, మాదాసు కిషోర్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ టోర్నమెంట్‌కు డైరెక్టర్‌గా వి.హరికృష్ణ, చీఫ్ ఆర్బిటర్‌గా ఎన్‌ఎ అమ్మినేని ఉదయ్‌కుమార్ వ్యవహరించారు.