ఆంధ్రప్రదేశ్‌

గిరిజన వైద్య కళాశాల ఏర్పాటులో పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: గిరిజనులకు ఆధునిక వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో వైఎస్సార్ ట్రైబల్ మెడికల్ కళాశాల ఏర్పాటులో కదలిక వచ్చింది. వైసీపీ అధికారం చేపట్టిన తరువాత పాడేరులో ట్రైబల్ మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత ట్రైబల్ మెడికల్ కళాశాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. విశాఖలో ఆదివారం పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ట్రైబల్ మెడికల్ కళాశాల అంశంపై అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జీ అర్జున, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ తదితరులతో ఈ అంశంపై సమగ్ర సమాచారం అడిగితెలుసుకున్నారు. విశాఖ ఏజెన్సీ పరిధిలో 11 గిరిజన మండలాల పరిధిలోని 3,600 గ్రామ శివార్లలో 6.5 లక్షల మంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయనున్నారు. సీఎం జగన్ శంకుస్థాపన చేసిన తరువాత పాడేరు ఏరియా ఆసుపత్రి కేంద్రంగా సేవలందించే అవకాశం ఉంది. ప్రస్తుత పాడేరు ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా స్థాయిని పెంచనున్నారు. ఏరియా ఆసుపత్రిలోనే మెడికల్ కళాశాలను నిర్వహిస్తూ అదనపు భవనాలు నిర్మించాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఏజెన్సీ పరిధిలోని చింతపల్లి, అరకు వేలీలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లున్నాయి. అయితే ఇక్కడ వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా గిరిజనులకు సరైన వైద్య సేవలందట్లేదన్నది వాస్తవం. వీటితో పాటు 11 గిరిజన మండలాల పరిధిలో 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే వీటిలో అత్యధికంగా వైద్య సిబ్బంది సేవలు అందుబాటులో లేవు. ఏజెన్సీలో పనిచేసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పోస్టుల భర్తీ సాధ్యం కావట్లేదు. కొంతమంది బదిలీపై వచ్చినా పూర్తిస్థాయి నివాసం ఏర్పరచుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పాడేరు మెడికల్ కళాశాలకు అనుబంధంగా పారా మెడికల్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఏజెన్సీలో ఇంటర్ పూర్తి చేసిన యువత వైద్య సేవలందించడం ద్వారా ఉపాధి పొందుతారని అభిప్రాయపడ్డారు.
*చిత్రం... వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో ఏఎంసీ ప్రిన్సిపాల్ సుధాకర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ అర్జున