ఆంధ్రప్రదేశ్‌

ఏపీపీ ఉద్యోగాలకు 49 మంది ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో ప్రాసిక్యూషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 50 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలను డీజీపీ గౌతం సవాంగ్‌తో కలిసి హోంమంత్రి మేకతోటి సుచరిత విడుదల చేశారు. మంగళవారం సచివాలయంలోని 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో ఫలితాలను ప్రకటించారు. అనంతరం హోం మంత్రి సుచరిత మీడియాతో మాట్లాడారు. రాష్టవ్య్రాప్తంగా 50 ఏపీపీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించగా 2వేల 488 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు. వారిలో 1981 మంది రాత పరీక్షకు హాజరు కాగా 496 మంది ఉత్తీర్ణ సాధించారని తెలిపారు. వీరిలో 97 మంది వౌఖిక పరీక్షకు హాజరు కాగా 49 మంది అర్హత సాధించారని వివరించారు. జోన్ 4లో ఆర్థోపెడికల్లీ హ్యాండీకాప్డ్ (మహిళ) కేటగిరీ కింద కేటాయించిన ఒక ఏపీపీ ఉద్యోగానికి తగిన అర్హతగల అభ్యర్థి లేనందున ఆ పోస్టును భర్తీ చేయలేదన్నారు. ఏపీపీ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 22 మంది పురుషులు కాగా 27 మంది మహిళలు ఉన్నారన్నారు. 33 శాతం రిజర్వేషన్లను మించి 50 శాతం పైగా మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హత సాధించడం విశేషమని ప్రశంసించారు. ఎంపికైన వారిలో ఎం లావణ్య 281.5 శాతం మార్కులతో ప్రథమ స్థానంలో, సీహెచ్ రవిచంద్ర 277.3 శాతం మార్కులతో ద్వితీయ స్థానం, తేజ్‌శేఖర్ 251 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు వారం రోజుల్లో సర్ట్ఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తిచేసి ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణకు పంపుతామని తెలిపారు. అభ్యర్థులు రాత, వౌఖిక పరీక్షల మార్కులను వెబ్‌సైట్‌లో పొందుపరిచామని అందులో నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఎస్‌ఐపీఆర్‌బీ.ఏపీ.జీఓవి.ఇన్ వెబ్‌సైట్ ద్వారా మార్కుల జాబితా పొందాలన్నారు. దిశ చట్టం గురించి హోం మంత్రి మాట్లాడుతూ చట్టానికి సంబంధించిన ప్రత్యేక యాప్‌కు మంచి స్పందన వస్తోందని 4వేల ఫోన్‌కాల్స్ వస్తే వాటిలో అత్యధిక శాతం ఆ యాప్ పనిచేస్తోందో లేదో పరీక్షించే కాల్స్ అధికంగా ఉన్నాయని వివరించారు. డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ ఏపీపీ ఉద్యోగాల భర్తీని పారదర్శకంగా నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడించామన్నారు. దిశ చట్టం గురించి మాట్లాడుతూ ఈ చట్టంతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావని, మిగతా చట్టాలు కూడా సక్రమంగా అమలు జరిగితేనే పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్‌కుమార్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధ్యక్షులు, అదనపు డీజీపీ అమిత్ గార్గ్, రాష్ట్ర ప్రాసిక్యూషన్స్ విభాగం సంయుక్త సంచాలకులు బీ రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... ఏపీపీ ఉద్యోగ ఫలితాలు విడుదల అనంతరం మాట్లాడుతున్న హోంమంత్రి సుచరిత, చిత్రంలో డీజీపీ సవాంగ్