ఆంధ్రప్రదేశ్‌

8 మంది ఐపీఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హాం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఆర్‌ఎం కిషోర్ కుమార్‌ను ఏపీ రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌గా, పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అదనపు డీజీపీ కుమార్ విశ్వజీత్‌ను హాం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, అదనపు డీజీపీ ఎన్. బాలసుబ్రహ్మణ్యంను రైల్వే అదనపు డీజీపీగా నియమించింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ క్రిపానంద్ త్రిపాఠీ ఉజేలాను పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న డీఐజీ సునీల్ కుమార్ నాయక్‌ను ఆదే హోదాలో సీఐడీకి బదిలీ చేయగా, ఎస్పీ అభిషేక్ మోహంతిని గ్రేహౌండ్స్ గ్రూపు కమాండర్ (అడ్మిన్)గా నియమించింది. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ పి.హరికుమార్‌ను పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. గుంటూరు ఐజీపీ వినీత్ బ్రిజ్‌లాల్‌కు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.