ఆంధ్రప్రదేశ్‌

పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం గురువారం ఆర్డినెన్సు గురువారం జారీ చేసింది. దీంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ 13 రోజులకు, ప్రాదేశిక స్థానాల ఎన్నికల ప్రక్రియ 15 రోజులకు పరిమితం కానుంది. పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం 5 రోజులు, ప్రాదేశిక నియోజకవర్గాల్లో 7 రోజులుగా ఖరారు చేస్తూ ఆర్డినెన్సు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో కొన్ని సవరణలు చేసేందుకు ఇటీవల జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 13 రోజుల్లో ముగియనుంది. ప్రచారం 5 రోజులకే పరిమితం చేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ప్రచారం 7 రోజులకే పరిమితం చేసింది. మద్యం, నగదు పంపిణీ వంటి చర్యలకు పాల్పడితే ఎన్నికల్లో అనర్హత వేటు వేస్తారు. షెడ్యూల్ ఏరియాలోని అన్ని సీట్లు గిరిజనులకే రిజర్వు చేస్తారు.