ఆంధ్రప్రదేశ్‌

టీటీడీ తరహాలోనే మరో 8 పాలకమండళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: రాష్ట్రంలోని 8 ప్రధాన దేవాలయాల పాలక మండళ్ల నియామక అధికారం ఇకపై రాష్ట్ర ప్రభుత్వానికి దఖలు పరుస్తూ దేవదాయ శాఖ ఆర్డినెన్సు జారీ చేసింది. ఆర్డినెన్సు ఆధారంగా మూడు దేవస్థానాల పాలక మండళ్లను ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులను కూడా జారీ చేసింది. సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) మినహా మిగిలిన దేవస్థానాల పాలక మండళ్ల నియామకానికి సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు.
ఆ దరఖాస్తుల వడబోత అనంతరం పాలక మండలి సభ్యులను ఖరారు చేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే టీటీడీ తరహాలోనే మరో 8 ప్రముఖ దేవస్థానాల పాలక మండళ్ల సభ్యులను దరఖాస్తులు లేకుండా నేరుగా ప్రభుత్వమే నియమించేందుకు వీలుగా ఆర్డినెన్సును జారీ చేసింది. ఏపీ ధార్మిక, హిందూ మత సంస్థల, ఎండోమెంట్ల చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్సును తీసుకువచ్చింది. తాజా ఆర్డినెన్సు ప్రకారం టీటీడీ తరహాలో ప్రభుత్వమే 8 ఆలయాల పాలక మండళ్లను నేరుగా నియమించేందుకు వీలు కలుగుతుంది.
శ్రీవరహా లక్ష్మీ స్వామి దేవస్థానం (సింహాచలం), శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం (అన్నవరం), శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం (ద్వారకా తిరుమల), శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం (విజయవాడ), శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం (శ్రీకాళహస్తి), శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం (శ్రీశైలం), శ్రీలక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు), శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం (కాణిపాకం)లకు చట్టం నుంచి మినహాయింపు ఇస్తూ సవరణ చేసింది. పాలక మండలిలో మార్పులు, రద్దు వంటివి ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. ఆర్డినెన్సు జారీ చేయడంతో మూడు దేవస్థానాల పాలక మండళ్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలక మండళ్ల పదవీ కాలం రెండు సంవత్సరాలు.
పాలక మండళ్ల సభ్యులు వీరే
సింహాచలం : వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా దాడి దేవి, వారణాసి దినేష్ రాజు, నల్లమిల్లి కృష్ణారెడ్డి, జి.మాధవి, గడ్డం ఉమ, రాగాల నరసింహరావు నాయుడు, దాడి రత్నాకర్, సూరిశెట్టి సూరిబాబు, రంగోలి పోతన్న, సంచిత గజపతిరాజు, దొంకాడ పద్మావతి, నెమ్మది చంద్రకళ, సిరిపురపు ఆషా కుమారి, విజయ్ కె సోంధి, గోదావరి గోపాల కృష్ణమాచార్యులు.
ద్వారకా తిరుమల: సభ్యులుగా మాటూరు శ్రీవల్లి, గ్రంథి శేషగిరి రావు, కర్పూరం గవరయ్య గుప్తా, గూడూరి ఉమా బాల, కంకటాల నాగ సత్యనారాయణ, కొండేటి పద్మజ, కొత్త విజయలక్ష్మి, చిలువులూరి సత్యనారాయణ రాజు, కుంజా శాంతి, నందిని బండంరావూరి, మానుకొండ నాగ లక్ష్మి, జి.సత్యనారాయణ, మేడిబోయిన గంగ రాజు, వీరమళ్ల వేంకటేశ్వర రావు, ఎక్స్-ఆఫీషియో సభ్యునిగా పీవీఎస్సార్ జగన్నాథ ఆచార్యులు
విజయవాడ: పైలా సోమి నాయుడు, కటకం శ్రీదేవి, డీవీఆర్‌కే ప్రసాద్, బూసిరెడ్డి సుబ్బాయమ్మ, పులి చంద్రకళ, ఓవీ రమణ, గంటా ప్రసాదరావు, రాచమల్లు శివప్రసాద రెడ్డి, చక్కా వెంకట నాగ వరలక్ష్మి, కార్తీక రాజ్యలక్ష్మి, నేతికొప్పుల సుజాత, నాలపట్ట అంబిక, కనుగుల వెంకట రమణ, నేర్సు సతీష్, బండారు జ్యోతి, ఎక్స్ అఫీషియో సభ్యుడిగా లింగబొట్ల దుర్గా ప్రసాద్