ఆంధ్రప్రదేశ్‌

ఉనికి కాపాడుకునేందుకే టీడీపీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 22: రాజధాని ప్రాంతంతో పాటు రాష్టవ్య్రాప్తంగా తమ ఉనికిని కాపాడుకునేందుకు టీడీపీకి చెందిన వారు దాడులకు పాల్పడుతున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆరోపించారు. టీడీపీ చనిపోకుండా కాపాడుకోవడమే ధ్యేయంగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. శనివారం గుంటూరులోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ కేవలం వికేంద్రీకరణ వల్లే రాజధానిలో పలువురు గుండెపోటుతో చనిపోతున్నారని, మహిళలు స్నానాలు చేస్తుంటే డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారంటూ అసత్యాలు, అబద్ధాలు, విష ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం రైతులదని, మహిళల అభ్యున్నతి కోసం నిలబడ్డ ప్రభుత్వమన్నారు. రాజధాని ఉద్యమం ముసుగులో కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు దుశ్చర్యలకు పాల్పడుతూ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చివరకు మహిళల మాన, మర్యాదలకు సంబంధించిన అంశాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. స్ర్తి జాతికే అవమానం కల్గించేలా టీడీపీ రాజకీయం చేస్తోందని, కనీసం మహిళల గురించి రాస్తున్నామనే స్పృహ కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో పోలీసులు డ్రోన్‌లు వినియోగించడం కొత్త కాదన్నారు. కేవలం శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకే మందడంలో డ్రోన్‌లను పోలీసులు ఉపయోగించారని స్పష్టంచేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేసుకుంటే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని సూచించారు. అయితే ఉద్యమం ముసుగులో టీడీపీ నాయకులు అక్కడి ప్రజలు, ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళలను అడ్డుపెట్టుకుని నీతిమాలిన రాజకీయాలు చేస్తూ తిరిగి పోలీసులపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి బాత్‌రూం నిర్మించానని చెప్పిన చంద్రబాబు మరోవైపు మహిళలు స్నానాలు చేస్తుంటే చిత్రీకరిస్తున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవరిస్తే ఎవరైనా సరే దిశ చట్టం మేరకు శిక్షలు ఉంటాయని హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు.