ఆంధ్రప్రదేశ్‌

పునరావాసానికి నిధుల సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి నిధుల సమస్య వెన్నాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను కూడా కేంద్రం విడుదల చేయకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. పోలవరం ప్రాజెక్టు తొలిదశలో +41.15 మీటర్ల కాంటూరు పరిధిలో దాదాపు 6,800 కుటుంబాలను తరలించి పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఇందుకు 3,166 కోట్ల రూపాయల మేర అవసరం అవుతాయని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. తొలిదశ పునరావాస పనులను ఈ ఏడాది మే నెల నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అయితే నిధుల కొరత వల్ల పనులు ఆశించిన మేర జరగటం లేదు. పునరావాస కాలనీల నిర్మాణానికే దాదాపు 300కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని, ఈ మొత్తాన్ని విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు లేఖ రాశారు. నిధుల కొరత వల్ల కేటాయింపులు చేయలేని స్థితి నెలకొంది. అయితే పోలవరం బాధిత కుటుంబాల వివరాలు నమోదు చేసేందుకు వీలుగా 5.66 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది.
కేటాయింపులు జరిగేనా?
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 2017 నాటికే పూర్తి చేయాలని సంకల్పించినా వివిధ కారణాల వల్ల సాధ్యంకాలేదు. తాజాగా 2021 నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపించేందుకు సివిల్ పనులకు ఏటా 6వేల కోట్ల రూపాయలు, పునరావాసం పనులకు ఏటా 10వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉంది. ఇంకా పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించాల్సి ఉంది. గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో 39వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, ఖర్చుచేసింది మాత్రం దాదాపు 7100 కోట్ల రూపాయలు మాత్రమే. రాష్ట్ర జలవనరుల శాఖ బడ్జెట్ కూడా 13వేల కోట్ల రూపాయలే ఉంటోంది. దీంతో పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించడం సాధ్యంకాదు. ప్రాజెక్టు నిర్మాణాన్ని వచ్చే ఏడాది నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యం నేపథ్యంలో త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 10వేల కోట్ల రూపాయల మేర కేటాయింపులు చేయాలని జలవనరుల శాఖ కోరుతోంది. ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించాక కేంద్రం నుంచి నిధులు రావచ్చని, ఆ తరువాత ప్రాజెక్టు పనులు మరింత వేగంగా జరిగే వీలుందని భావిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఏమేరకు నిధులు కేటాయిస్తారో వేచి చూడాల్సిందే.