ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు : రాష్ట్రంలో రూ.36 వేల కోట్ల వ్యయంతో 10వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించినట్లు రాష్ట్ర విద్యుత్‌శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆదివారం ఒంగోలులోని కర్నూలురోడ్డులో 132కెవి ఉపకేంద్రం వద్ద 56.74 కోట్లరూపాయల అంచనాలతో చేపడుతున్న 132కెవి భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ శంకుస్థాపన కార్యక్రమంలో బాలినేనితోపాటు రాష్ట్ర క్రీడల శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు వస్తున్న
వార్తల్లో వాస్తవం లేదని, పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాల వలనే 40వేల కోట్ల రూపాయల అప్పులు విద్యుత్ రంగంలో మిగిలాయని మంత్రి పేర్కొన్నారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై విచారణకు ఆదేశం
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై విచారణకు ఆదేశించామని రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఒంగోలు మినీస్టేడియంలో ఆదివారం రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీలను మంత్రి బాలినేనితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తామని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అవినీతిని వెలికితీసేందుకు సిట్‌ను ఏర్పాటుచేస్తే తెలుగుదేశంపార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారని ధ్వజమెత్తారు.
*చిత్రం... ఒంగోలులో 132కెవి భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు బాలినేని, ముత్తంశెట్టి, ఆదిమూలపు తదితరులు