ఆంధ్రప్రదేశ్‌

సందిగ్ధంలో మున్సిపల్ ఎన్నికలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 23: ఇదిగో మున్సిపల్ ఎన్నికలు.. అంటూ నెల రోజులుగా హడావుడి చేస్తున్నా కనీసం వార్డుల రిజర్వేషన్లు ప్రకటించకపోవడంతో ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తిచేశారు. అయితే కీలకమైన వార్డుల రిజర్వేషన్లు మున్సిపల్ ఛైర్‌పర్సన్ రిజర్వేన్లను ప్రకటించకపోవడం గమనార్హం. రిజర్వేషన్‌లను ప్రకటించిన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్‌ల ప్రకటన ప్రభుత్వం చేతిలో ఉండగా, ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధీనంలో ఉంటుంది. ప్రభుత్వం రిజర్వేషన్‌లను ప్రకటించి వాటి వివరాలను ఎన్నికల కమిషన్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడంలేదు. మరోపక్క మార్చి మొదటి వారం నుంచి రాష్ట్రంలో పరీక్షల సీజను ప్రారంభం కానుంది. మార్చి 4వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు, ఆ తర్వాత పదోతరగతి పరీక్షలు వరసగా వచ్చేస్తున్నాయి. పరీక్షల సీజన్ ముగియాలంటే ఏప్రిల్ 23వ తేదీ దాకా ఆగాల్సిందే. ఎన్నికల నిర్వహణకు కనీసం 15 రోజులు అవసరం. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా పక్షం రోజుల సమయం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
దీనికి తోడు అధికార పార్టీలో ఎలాంటి ఎన్నికల సందడి కనిపించకపోవడం ఈ అనుమానానికి బలం చేకూరుస్తోంది. ఇటీవల పింఛన్లు, రేషన్ కార్డుల తొలగింపుపై జనంలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అర్హులను సైతం తొలగించడంతో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు జోరుగా సాగాయి. ఇదే అవకాశంగా భావించిన తెలుగుదేశం పార్టీ ఆందోళనలకు మద్దతు ప్రకటించి జోరుగా వ్యతిరేకతను పెంచేందుకు ప్రయత్నించింది. దీంతో వెంటనే ప్రభుత్వం మేల్కొని రీ సర్వే చేయిస్తూ తొలగించిన పింఛన్‌లలో దాదాపు 90 శాతం పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. మరోవైపు రేషన్ కార్డుల రీసర్వే కొనసాగుతోంది. వీటి కారణంగానే ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల పైనే వెనుకడుగు వేసినట్లు కనిపిస్తోంది. ఎన్నికలు వస్తాయని హడావుడి చేసిన చోటా మోటా నాయకులు, ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహులు ప్రస్తుత పరిస్థితులతో అయోమయంలో పడ్డారు.