ఆంధ్రప్రదేశ్‌

అట్టహాసంగా ప్రారంభమైన ‘ఏక్ భారత్ - శ్రేష్ట భారత్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 23: తిరుపతిలో ‘ఏక్‌భారత్ శ్రేష్ట భారత్’ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం తిరుపతిలోని యూత్ హాస్టల్‌లో ఈ కార్యక్రమాన్ని కేంద్ర నెహ్రూ యువకేంద్ర సంఘటన్ ఉపాధ్యక్షులు విష్ణువర్థన్‌రెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లిదుర్గాప్రసాద్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘటన్ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 14 రాష్ట్రాల నుండి 250మంది యువతీ, యువకులు తిరుపతికి వచ్చారని, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు మనకు తెలిసేలా కళాప్రదర్శనలు, వారి సంప్రదాయాలు మనం తెలుసుకునేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు.
ఏక్ భారత్ శ్రేష్ట్భారత్ కార్యక్రమం నిర్వహించి భారతీయ కళలను, గిరిజన సంస్కృతిని దేశవ్యాప్తంగా యువతకు అందించి వారు మావోయిస్టుల బారినపడి పెడతోవ పట్టించకుండా ఉండటానికి దేశ సమైఖ్యతను చాటే విధంగా ప్రధాని మోదీ ఆశయం మేరకు గత మూడేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. కేంద్ర నెహ్రూ యువకేంద్ర సంఘటన్ దేశంలో 620 జిల్లాల్లో ఉందయని, ప్రతి సంవత్సరం 10వేల మంది యువతకు సహకారం అందిస్తుందని, సర్దార్ వల్లభాయి పటేల్ ఆదర్శంగా యూనిటీ అనే నినాదంతో భారతీయ సంస్కృతి చాటి చెప్పేలా 45 దేశాల్లో మన ప్రదర్శనలు ఇస్తున్నామన్నారు.
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మాట్లాడుతూ మనం ఎక్కడున్నా భారతీయులమనే భావన కలగాలని, ప్రజాస్వామ్య దేశంలో యువత ప్రధాన పాత్ర పోషించాలన్నారు. రాష్ట్రాల వారీగా నిర్వహించిన సంస్కృతి సంప్రదాయాల కళా ప్రదర్శనలు ఎంతో గొప్పగా ఉన్నాయన్నారు.
*చిత్రం... ‘ఏక్‌భారత్ శ్రేష్ట భారత్’ కార్యక్రమంలో మాట్లాడుతున్న
కేంద్ర నెహ్రూ యువకేంద్ర సంఘటన్ ఉపాధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి