ఆంధ్రప్రదేశ్‌

పకడ్బందీగా టెన్త్, ఇంటర్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్న భోజనం, ఇంగ్లీషు మీడియం, టెన్త్, ఇంటర్ పరీక్షలపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటి నిఘాలో పరీక్షలు నిర్వహించాలన్నారు. విద్యార్థులు కింద కూర్చుని పరీక్ష రాసే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని స్పష్టం చేశారు. అవసరమైన వసతులు విద్యార్థులకు కల్పించాలన్నారు.టెన్త్ పరీక్ష పత్రాల్లో చేసిన మార్పులను విద్యార్థులకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డీఈవోలు దీనిపై దృష్టి సారించాలన్నారు.
ఇప్పటికే నమూనా ప్రశ్నప్రతాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని గుర్తుచేశారు. పరీక్ష కేంద్రాల లోకేషన్ విద్యార్థులకు తెలిసేలా ఒక యాప్‌ను అందుబాటులో ఉంచాలన్నారు. మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేశామని, అది సక్రమంగా అమలు జరిగేలా చూడాలన్నారు. టెండర్లను వీలైనంత త్వరగా ఖరారు చేయాలన్నారు.ఇంగ్లీషు మీడియం అమలు చేయడంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల సూచనలను మంత్రి సురేష్ అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో పాఠశాల విద్య ప్రభుత్వ సలహాదారు మురళి, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ కార్యదర్శులు సాంబశివరెడ్డి, రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.
*చిత్రం...సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సురేష్