ఆంధ్రప్రదేశ్‌

పథకాల పేర్లుమార్చి రిబ్బన్ కటింగ్‌లా?: అనిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఫిబ్రవరి 24: వైసీపీ ప్రభుత్వ పనితీరు జరగాలి పెళ్లి మళ్లీమళ్లీ అన్నట్లుగా ఉందని రాష్ట్ర తెలుగుమహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో సక్రమంగా అమలైన పథకాల పేర్లుమార్చి ఇప్పుడు జగన్ రిబ్బన్ కట్ చేస్తున్నారని సోమవారం ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు. రంగులు మార్చేసి సంబరపడుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి మాత్రం ఏం తప్పుచేసింది పాపం అని ప్రశ్నించారు. జగనన్న అమరావతి అనో, లేదా విజయమ్మావతి అనో మార్చుకోవాలని సూచించారు. అప్పుడైనా మీ ఇగో చల్లబడుతుంది జగన్ గారూ.. అంటూ ఆమె కామెంట్ చేశారు.