ఆంధ్రప్రదేశ్‌

దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: రాజధాని రైతుల ముసుగులో టీడీపీ శక్తులు బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై దాడికి తెగబడటంపై మంత్రులు మండిపడ్డారు. విజయనగరంలో జరిగే జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం విశాఖ చేరుకున్న పలువురు మంత్రులు జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంట సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ దళితులు అంటే చంద్రబాబుకు చిన్నచూపని, అందుకే తన వర్గం వారిచే దళిత ఎంపీపై దాడి చేయించారన్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కూడా దళితులపై ఇదే వైఖరి అవలంభించారన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే విషయంలో టీడీపీ వర్గాలు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్టు మంత్రి వర్గ పరిశీలనలో వెల్లడైందని, ఈ విషయంలో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. ఎంపీ సురేష్‌పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ ఎంపీ సురేష్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అధికారంలో ఉండగా చంద్రబాబు అండ్ కో చేసిన అక్రమాలు ఒకటొకటిగా వెలుగుచూస్తుండటంతో ప్రజల దృష్టి మరల్చేందుకే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతానికి వెళ్లే వాళ్లను ఇబ్బండి పెట్టాలని చూస్తున్నారన్నారు. మరోసారి ఇటువంటి దాడులకు తెగబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులపై దాడులు చేయడం రాజకీయాల్లో సరైన పద్ధతి కాదన్నారు. చంద్రబాబు అక్రమాలు బయటపడుతున్నాయని, అందుకే ఇటువంటి చర్యలకు దిగుతున్నారన్నారు. మహిళలను ముందు పెట్టి దాడులు చేయిస్తున్నారన్నారు. రాజధాని రైతుల ముసుగులో టీడీపీ గూండాలు దాడులకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా అలజడి సృష్టించడమే వారి లక్ష్యంగా పేర్కొన్నారు.
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి విషయంలో సీఎం జగన్ ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదన్నారు. తన పదవీ కాలంలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. రాజధాని ప్రాంత రైతులు చంద్రబాబు మాయలో పడొద్దని విజ్ఞప్తి చేశారు. దళితులపై దాడులు చేయిస్తున్న చంద్రబాబు తాను దళిత వ్యతిరేకినని మరోసారి నిరూపించుకున్నారన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ అభిమతమని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు.
*చిత్రం... విశాఖలో సోమవారం మీడియాతో మాట్లాడుతున్న మంత్రులు అవంతి, సుచరిత, పినిపే విశ్వరూప్