ఆంధ్రప్రదేశ్‌

బాబును ఇలాగే వదిలేస్తే రాష్ట్రం సర్వనాశనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 24: చంద్రబాబు నాయుడు పన్నాగం ప్రకారమే తనపై దాడి జరిగిందని, భౌతికంగా అంతమొందించేందుకు ప్రయత్నించారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ ఆరోపించారు. ఇందుకు కారకుడైన ప్రతిపక్ష నేత చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం అమరావతి వెళుతుండగా తన కారు వల్ల ఓ వ్యక్తికి చిన్న దెబ్బతగిలిన మాట వాస్తవమని, ఆయన్ను వెంటనే హాస్పిటల్‌కు పంపాలని కోరామని, వారుకూడా ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా భావించారన్నారు. అయితే అమరావతిలో రథోత్సవం ముగిసిన అనంతరం తాను అప్పిరెడ్డితో కలిసి నడుస్తూ వస్తుండగా జై అమరావతి, జై సీబీఎన్ అంటూ నినాదాలతో తన వెంటపడ్డారన్నారు. తనపై దాడికి యత్నించిన వారంతా మహిళా జేఏసీ ముసుగులో ఉన్న టీడీపీ నాయకులేనని ఆయన ఆరోపించారు. వారు తమపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, తనను టార్గెట్ చేశారని అర్థమైందన్నారు. వాస్తవాలు ఇలావుంటే కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. చంద్రబాబు ఇలా అబద్ధాలు చెప్పే రాష్ట్రంలో 23 సీట్లకు పరిమితమయ్యారన్నారు. దాడికి పాల్పడిన వారిలో అమరావతి రైతులెవ్వరూ లేరని, అందరూ పెయిడ్ ఆర్టిస్టులేనని విమర్శించారు. నిజమైన అమరావతి రైతులు తమకు ఎదురుపడి సమస్యలు పరిష్కరించాలని మాత్రమే కోరుతున్నారని చెప్పారు. సిట్ విచారణలో అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని రియల్ ఎస్టేట్ వ్యాపారులురైతుల ముసుగులో ధర్నాలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇదంతా చంద్రబాబు కుట్ర అని, హత్యా రాజకీయాలకు తెరతీస్తున్నారని, ఆయన్ను ఇలాగే వదిలేస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారని సురేష్ అన్నారు.
*చిత్రం... వైసీపీ ఎంపీ నందిగం సురేష్