ఆంధ్రప్రదేశ్‌

సచివాలయాల ద్వారా మెరుగైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయాలపై ఆమె సోమవారం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మరింతగా ప్రభుత్వ సేవలను చేరువ చేసేందుకు వీటిని ప్రారంభించామని తెలిపారు. తమకు కేటాయించిన విధులను సక్రమంగా సచివాలయ సిబ్బంది నిర్వహించాలన్నారు. జాబ్‌చార్ట్‌లో కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని, దీనిపై పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు కలిసి చర్చించుకోవాలన్నారు. 541 రకాల సేవలను సచివాలయాల ద్వారా అందుబాటులోకి తెచ్చామని అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ విభాగం ప్రత్యేక కమిషనర్ కన్నబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి పాల్గొన్నారు.

*చిత్రం... గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎస్ నీలం సాహ్ని