ఆంధ్రప్రదేశ్‌

విశాఖ లైట్‌మెట్రో డీపీఆర్‌కు ప్రభుత్వ అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 24: విశాఖలో లైట్‌మెట్రో, మోడర్న్ ట్రామ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి సవివర నివేదిక (డీపీఆర్) తయారు చేసేందుకు అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అనుమతి మంజూరు చేసింది. విశాఖలో 79.91 కిలోమీటర్ల మేర లైట్‌మెట్రో రైల్, 60.2 కిలోమీటర్ల మేర మోడర్న్ ట్రామ్ కారిడార్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా కొటేషన్లను ఆహ్వానించాలని ఆదేశించింది.
రూ. 34.1 కోట్లతో 32 గిరిజన విద్యాసంస్థల అభివృద్ధి
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 32 గిరిజన విద్యాసంస్థలను 34.1 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, గురుకులాలు, జూనియర్ కళాశాలలను ఈ నిధులతో అభివృద్ధి చేస్తారు. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సిట్ పరిధి ఖరారు
రాజధాని ప్రాంతంలో భూములు, తదితర అంశాలపై మంత్రివర్గ సబ్ కమిటీ సిఫార్సు చేసిన నేపథ్యంలో స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీమ్ (సిట్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిట్ పరిధిని ఖరారు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌ను ఒక పోలీస్ స్టేషన్‌గా పరిగణిస్తూ, రాష్ట్రం అంతటికీ పోలీస్ స్టేషన్‌గా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో ఎవరినైనా, ఎక్కడైనా విచారించే వీలు కలుగుతుంది.
28 ఆలయాల పాలక మండళ్లు రద్దు
రాష్ట్రంలో మరో 28 దేవాలయాల పాలక మండళ్లను రద్దుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిన నేపథ్యంలో గతంలో ఏర్పాటు చేసిన పాలక మండళ్లను ప్రభుత్వం రద్దు చేసింది.