ఆంధ్రప్రదేశ్‌

మీ పనితీరు మెరుగు పరచుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: గిరిజన ప్రాంతంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాల్లో గిరిజన సంక్షేమ శాఖ అధికారుల పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పనితీరును మెరుగుపరచకుని, ప్రభుత్వ లక్ష్యాలను గిరిజనులకు చేరేలా చూడాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీ పుష్పశ్రీ వాణి స్పష్టం చేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, సబ్ కలెక్టర్లు, ఉప సంచాలకులు, గిరిజన సంక్షేమాధికారులు, గిరిజన సహకార సంస్థ అధికారులతో విశాఖలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనాభివృద్ధిలో విజయాలైనా, వైఫల్యాలైనా అందుకు ప్రాజెక్టు అధికారులే బాధ్యులని, ఈ విషయాన్ని గుర్తుంచుకుని యంత్రాంగం గిరిజనులకు సేవలందించాలన్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు వినూత్నంగా ఆలోచించాలని, అందుకే ఐటీడీఏల్లో ఐఏఎస్ అధికారులను నియమించామన్నారు. ముఖ్యమంత్రి జగన్ విద్యకు విశేష ప్రాధాన్యతనిస్తున్నారని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలంటే పీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. విద్యా నైపుణ్యాలు, బోధనా సామర్థ్యం లేని సీఆర్టీలపై చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం పీవోలు తమకున్న విస్తృతాధికారాలు ఉపయోగించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ప్రతి మూడు నెలలకోసారి ఐటీడీఏ పాలకమండలి సమావేశాలు నిర్వహించాలన్నారు. గిరిజనాభివృద్ధికి కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ ఫలితం ఉండట్లేదని, కొండ శిఖర ప్రాంతాలకు ఇప్పటికీ సరైన రోడ్లు లేవని, గర్భిణులు, రోగులను ఆసుపత్రులకు తరలించాలంటే డోలీలే దిక్కవుతున్నాయన్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో వాస్తవ విద్యార్థు సంఖ్య కంటే హాజరు ఎక్కువగా ఉందని, సంబంధిత వార్డెన్‌పై చర్యలు తీసుకున్నారన్నారు. గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల విషయంలో చోటుచేసుకుంటున్న అవకతవకలను సరిద్దాలన్నారు. ట్రాన్స్‌కో, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించి ఇటువంటి తప్పిదాలు దొర్లకుండా చూడాలన్నారు. ఐటీడీఏల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను ప్రక్షాళన చేయాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో మహిళా సంఘాలకు ఇస్తున్న రుణాల రికవరీ సక్రమంగా లేదని, పర్యవేక్షులను నియమించినా ఫలితం రాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు సబ్జెక్టుల వారీగా శిక్షణ ఇవ్వాల్సి ఉందని, పాడేరు ఐటీడీఏ పీవో డీకే బాలాజీ మంత్రి దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. తాను కూడా గిరిజన సంక్షేమ పాఠశాలలోనే చదువుకున్నానని, కొండ శిఖర గ్రామాల్లో విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయులు బినామీలతో నడిపిస్తుంటారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం రవిచంద్ర మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పథకం అమలవుతందని తెలిపారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో బయోమెట్రిక్ హాజరు శాతం తక్కువగా నమోదవుతోందన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రంజిత్ భాషా, జీసీసీ ఎండీ పీఏ శోభ, పార్వతీపురం ఐటీడీఏ పీవో బీఆర్ అంబేద్కర్, సీతంపేట పీవో సాయికాంత్ వర్మ, ట్రైకార్ ఎండీ రవీంద్ర బాబు, తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... పీవోలు, డీటీడబ్ల్యూవోలతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి