ఆంధ్రప్రదేశ్‌

అమరావతి పోరాటాన్ని మోదీ, షాకు వివరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 26: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు సాగిస్తున్న ఆందోళనలు బుధవారం కూడా కొనసాగాయి. బుధవారం నాటికి రాజధాని అమరావతి ఉద్యమం 71వ రోజుకు చేరుకుంది. అన్నదాతల పోరాటానికి మద్దతుగా రాష్టవ్య్రాప్తంగా పలు జిల్లాల నుండి రైతులు, యువకులు అమరావతికి తరలివచ్చి తమ మద్దతు తెలియజేశారు. రాజధాని పరిధిలోని తాళ్లాయపాలెం శైవక్షేత్రాన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు సందర్శించి శివస్వామితో భేటీ అయ్యారు. సమాచారం తెలుసుకున్న తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెంకు చెందిన రైతులు, మహిళలు, రైతు కూలీలు పెద్ద ఎత్తున తరలివెళ్లి శివస్వామి ద్వారా మురళీధరరావును కలుసుకున్నారు.
ఈ సందర్భంగా తమ సమస్యలను వివరిస్తూ మురళీధరరావుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, విభజన కష్టాల నుండి గట్టెక్కాలన్న ప్రభుత్వ పిలుపుతో ఆనాడు తమ పంట పొలాలను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చామని తెలిపారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేయడంతో తమ భవిష్యత్తుతో పాటు పిల్లల భవితకు తీవ్రస్థాయిలో భంగం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందన్నారు. 70 రోజులకు పైగా అన్నదాతలమైన తాము రోడ్లపైకి వచ్చి ఒకే రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు నిర్వహిస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించక పోవడం దారుణమని మొరపెట్టుకున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మురళీధరరావు.. రాజధాని రైతుల పోరాటాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాల దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఇలా ఉండగా తుళ్లూరు, మందడం వద్ద మహాధర్నా, 24 గంటల దీక్షల్లో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. కృష్ణాయపాలెం, వెలగపూడి, పెనుమాక, రాయపూడి, ఎర్రబాలెం, మంగళగిరి తదితర ప్రాంతాల్లో నిరాహార దీక్షలతో పాటు నిరసన శిబిరాల్లో రైతులు, మహిళలు పాల్గొని మూడు రాజధానులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంకటపాలెంలోని రామాలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జై అమరావతి సేవ్ అమరావతి అంటూ మహిళలు, రైతులు వందల సంఖ్యలో రామయ్యకు పూజలు చేశారు. కాగా టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, జేఏసీ నాయకులు రాజధాని గ్రామాలను సందర్శించి రైతులకు సంఘీభావం తెలియజేశారు. సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే 29 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రాష్ట్ర సంక్షేమానికి అండగా నిలబడ్డారన్నారు. ముఖ్యమంత్రి జగన్ తలకిందులుగా తపస్సు చేసినా రాజధాని మారదని స్పష్టంచేశారు. అడ్డగోలుగా అమరావతిని తరలించినా తిరిగి మరలా వెనక్కు వచ్చేస్తుందని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని మారుస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
*చిత్రం... బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావుకు గోడు వెళ్లబోసుకుంటున్న మహిళలు